గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Janhvi Kapoor : ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్..?

Janhvi Kapoor : టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా షూటింగ్ పూర్తి…

Janhvi Kapoor : ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్..?

Janhvi Kapoor : టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న తారక్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటించనున్నారు. అయితే ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Janhvi Kapoor may enter into tollywood with NTR movie

ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో తారక్ సరసన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమాలో తారక్ సరసన నటించడం కోసం అలియా, కియారా పేర్లు వినిపించినప్పటికీ తాజాగా జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది.ఇందులో దాదాపుగా జాన్వీ కపూర్ ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అయితే గతంలో శ్రీదేవి చనిపోకముందు తారక్ తో శ్రీదేవి ఒకానొక సందర్భంలో తన కూతురిని టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ద్వారా పరిచయం చేయాలని కోరిందట. తారక్ తాత సీనియర్ ఎన్టీ రామారావు, శ్రీదేవి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అందుకోసమే ఎన్టీఆర్ సినిమా ద్వారా తన కూతురిని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్టీఆర్ తో చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శ్రీదేవి కోరిక నెరవేరబోతోందని అనిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే.. వేచి చూడక తప్పదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి