Karthika Deepam : గట్టి ప్రూఫ్ తో వచ్చిన వంటలక్క.. షాక్ లో మోనిత!

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతోంది. వంటలక్క తన తల్లి ఇంటికి వెళ్లి తన తండ్రితో కాసేపు సమయాన్ని గడుపుతుంది. ఇక అక్కడి నుంచి వారణాసి ఆటోలో మోనిత వాళ్ళ ఇంటికి బయలు దేరుతుంది. మరోవైపు మోనిత బాబు బారసాల కోసం తెగ హడావుడి చేస్తుంది. కార్తీక్,  సౌందర్య,  ఆనందరావు ఇష్టం లేకున్నా కూడా మోనిత వాళ్ళ ఇంటికి బయలు దేరుతారు.

దీపలో చాలా మార్పులు వచ్చాయి అనుకుంటూ ఏం చేస్తుందో అని తలుచుకుంటూ సౌందర్య ఏడుస్తూ దీప తీసుకున్న నిర్ణయం చివరిది అనిపిస్తుంది.. అని బాధతో కుమిలిపోతుంది. ఇక మోనిత తన ఇంట్లో సౌందర్య రాక కోసం ఎదురుచూస్తుంటుంది. ఇక భారతి రావడంతో కాసేపు బాధతో మాట్లాడుతుంది. భారతి మాత్రం మోనిత సంతోషాన్ని చూసి ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతుంది. అంతలోనే దీప రావటంతో ఈ రోజే ఏదో క్లైమాక్స్ ఉండబోతుందని అనుకుంటుంది.

దీప రాకను చూసి ప్రియమణి, భారతి ఆశ్చర్యపోతారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సందడి గురించి సంతోషంగా మాట్లాడటంతో అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక భారతిని కూడా పలకరిస్తూ మోనితకు డెలివరీ చేసినందుకు థాంక్స్ చెబుతుంది దీప. మొత్తానికి దీప కొత్తగా కనిపించడంతో భారతి ఏం జరుగుతుందో అని ఆలోచనలో ఉంటుంది. ఇక దీప తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ ను ప్రియమణికి ఇచ్చి లోపల పెట్టమంటుంది.

తరువాయి భాగంలో సౌందర్య వాళ్లంతా రాగా అందరి ముందు తనది సహజ గర్భం అని చెప్పడానికి ప్రయత్నించడంతో వెంటనే దీప కోపంతో రగిలిపోతూ మోనితపై చెయ్యి ఎత్తుతుంది. ఇక దీప తన బ్యాగ్ లో నుంచి ఏవో గట్టి ప్రూఫ్స్ పట్టుకొచ్చినట్లు పేపర్స్ తీస్తున్నట్లు కనిపించగా కార్తీక్, సౌందర్య, ఆనందరావు ఆశ్చర్యంగా ఉన్నట్లు కనిపిస్తారు. మోనిత మాత్రం షాక్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM