RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఏ అప్‌డేట్ వచ్చినా కూడా అది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంటుంది. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుదల చేయగా, దానికి మామూలు ఆదరణ దక్కలేదు. ఈ గ్లింప్స్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ చాలా తక్కువసేపే కనిపించినా.. ఎప్పటిలాగానే తన విజువల్స్‌తో మార్కులు కొట్టేశాడు రాజమౌళి.
ఇక ఈ సినిమా నుండి విడుదలయిన దోస్తీ పాట, ‘నాటు నాటు’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండూ మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీపై సోషల్ మీడియాలో ఓ రూమర్ మొదలయింది. డిసెంబర్ 4న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుందని నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్త నిజమయితే బాగుంటుందని ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కొద్ది సేపటి క్రితం ఎన్టీఆర్‌కి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ ముఖానికి రక్తపు మరకలతో చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు స్టన్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుండగా, ఇవి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సునీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…