Shruti Haasan : లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కమల్ ఇటీవల తన సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభోత్సవానికి యూఎస్ వెళ్లారు. తిరిగి వచ్చాక దగ్గు మొదలైంది. దీంతో లక్షణాలు అనుమానాస్పదంగా ఉండడంతో పరీక్షలు చేయించుకున్నారు. కమల్ కు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోవిడ్ పాజిటివ్ అని తేల్చారు. దీంతో కమల్ హాసన్ కు ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కమల్ హాసన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అమెరికా నుంచి వచ్చాక దగ్గు వచ్చింది. పరీక్షలు చేయించుకోగా కరోనా అని తేలింది. దీంతో చికిత్స తీసుకుంటున్నాను. ఇంకా కరోనా ప్రభావం తగ్గలేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి, అని కమల్ ట్వీట్ చేశారు. కమల్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. ఆందోళన చేనవలసిన అవసరం లేదని.. ప్రస్తుతం కమల్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంఎన్ఎం పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
కమల్ కి కరోనా సోకడంతో కొంత కాలం ఆయన ఐసోలేషన్ లో ఉండాలి. ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ సీజన్ 5 కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ తమిళ్ 5 కి ఎవరు టెంపరరీ హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో కమల్ గారాల పట్టి శృతి హాసన్ ఆ బాధ్యతలు మోయనుందని సమాచారం. గతంలో నాగార్జున లేనప్పుడు బిగ్ బాస్ షోని రమ్యకృష్ణ, సమంత ఆసక్తికరంగా నడిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు కమల్ ఆ షోకు దూరం కావడంతో అతని కుమార్తె శృతి పేరు వినిపిస్తోంది. మరి ఆమె ఆ షోను హోస్ట్ చేస్తుందా, లేదా.. అన్నది చూడాలి.
బాల్యంలో పడే ముద్రలు ఎంతో లోతుగా ఉంటాయని, పెదయ్యాక కూడా అవి బాధిస్తుంటాయని, వాటిని అంత సులభంగా మరిచిపోలేమని నటి…
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…