Jai Bhim Movie : వామ్మో 25 రోజుల్లో ఏకంగా హైకోర్టునే కట్టేశారుగా..!

November 9, 2021 12:49 PM

Jai Bhim Movie : సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించాలంటే అతి పెద్ద భారీ సెట్టింగ్స్ వేయాల్సి ఉంటుంది. అయితే కథ సన్నివేశాన్ని బట్టి ఆ సెట్టింగ్స్ ను రూపొందించుకుంటారు. అయితే కొన్ని సన్నివేశాలు తీయాలంటే ప్రత్యేకంగా కొన్ని నిజమైన కట్టడాలను పోలి ఉన్న సెట్టింగ్ లను వేయాల్సి వస్తుంది. ఇలాంటి సెట్ వేసేటప్పుడు నిజంగానే వాటి కొలతలు, వాటి రూపురేఖల మాదిరిగానే వేయాల్సి ఉంటుంది. ఇలాంటి సెట్టింగులు వేయడంలో గుణశేఖర్ దిట్ట అని చెప్పవచ్చు. ఈయన ఏకంగా మధుర మీనాక్షి ఆలయాన్ని అలాగే చార్మినార్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Jai Bhim Movie within 25 days court set has been built

ఇలాంటి మరొక సాహసాన్ని చేసింది జై భీమ్ చిత్రబృందం. సూర్య ప్రధాన పాత్రలో నటించిన జై భీమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అవుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ సన్నివేశాలు కోర్టులో ఉండటం వల్ల ఏకంగా చిత్రబృందం చెన్నై హైకోర్టును యథావిధిగా పునర్నిర్మించింది. సాధారణంగా చెన్నై హైకోర్టులో కి ఇతరులకు ఎవరికీ అనుమతి ఉండదు, అలాంటిది కొన్ని ఫోటోల ఆధారంగా కోర్టును ఎంతో అద్భుతంగా నిర్మించారు.

సాధారణంగా కోర్టు లోపలికి ఎవరికీ అనుమతి ఉండదు కానీ జై భీమ్ చిత్ర బృందానికి మాత్రం కేవలం కోర్టు హాలు చూడటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అదృష్టం కొద్దీ జస్టిస్ చంద్రు వాదించిన కేసులలో పలు ఫోటోలు ఉండడం వల్ల వాటి ఆధారంగా కేవలం 25 రోజులలోనే కోటను నిర్మించినట్లు చిత్రబృందం తెలియజేసింది.

ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత కొందరు హైకోర్టు న్యాయమూర్తులను అలాగే న్యాయవాదిని పిలిపించి చూపించగా వారు ఎంతో ఆశ్చర్యపోతూ హైకోర్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది, ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు.. అని చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment