Jabardasth Show : జ‌బ‌ర్ద‌స్త్ షో ఇక నిలిచిపోనుందా..? నిర్వాహ‌కులు ఏమంటున్నారు..?

Jabardasth Show : బుల్లితెర‌పై ఎంతో స‌క్సెస్ సాధించిన షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఒక‌టి. జ‌బ‌ర్దస్త్ షో వ‌స్తుందంటే చాలు.. ఇంటిల్లిపాదీ ఒక‌ప్పుడు ఎంతో ఇష్టంగా చూసేవారు. కానీ ఈ షోకు రాను రాను క‌ళ తప్పింది. బూతును ప్ర‌యోగించ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా మారింది. అయిన‌ప్ప‌టికీ ఈ షోకు రేటింగ్స్ త‌గ్గ‌లేదు. త‌రువాత ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌ను తీసుకొచ్చారు. ఒక షోకు అన‌సూయ‌, ఇంకో దానికి ర‌ష్మి గౌత‌మ్ యాంక‌ర్లుగా చేస్తున్నారు. త‌రువాత జ‌డ్జిగా నాగ‌బాబు దూర‌మ‌య్యారు. కొంత కాలానికి రోజా కూడా దూర‌మ‌య్యారు. ఇప్పుడు క‌మెడియ‌న్లు కూడా దూర‌మ‌వుతున్నారు. దీంతో జ‌బ‌ర్ద‌స్త్ షో ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డింది.

స్టార్ క‌మెడియ‌న్లు అంద‌రూ ప్ర‌స్తుతం ఇత‌ర టీవీల‌లో వ‌చ్చే షోల‌లో క‌నిపిస్తున్నారు. అంద‌రూ జ‌బ‌ర్ద‌స్త్‌లో ప‌నిచేసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే సుధీర్‌, శ్రీ‌ను, ఆది వంటి వారు ఈ షోకు దూర‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే రెండు షోల‌ను తీసేసి ఒక షోనే ఉంచుతార‌ని.. దానికి ర‌ష్మిని యాంక‌ర్‌గా చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ షో ఇక నిలిచిపోతుంద‌నే వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అయితే దీనిపై నిర్వాహ‌కులు మ‌ల్లెమాల సంస్థ వారు స్పందించారు.

Jabardasth Show

జ‌బ‌ర్ద‌స్త్ షో నిలిచిపోతుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. ఎంతో మంది క‌మెడియ‌న్లు వ‌స్తుంటారు.. పోతుంటారు.. కొత్త‌వారితో అయినా స‌రే ఈ షోను న‌డిపిస్తాం. కానీ ఆపే ప్ర‌సక్తే లేదు. ఈ షో ను ఆపేస్తున్నామ‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. కాగా జ‌బ‌ర్ద‌స్త్ షోకు ఈ మ‌ధ్య కాలంలో రేటింగ్స్ కూడా బాగా తగ్గాయి. దీంతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి రేటింగ్స్ రాబ‌ట్టాల‌ని చూస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే ఇంత చేసిన‌ప్ప‌టికీ ఈ షోకు ప్ర‌స్తుతం క‌ళ త‌ప్పింద‌నే చెప్ప‌వ‌చ్చు. అస‌లే స్టార్ క‌మెడియ‌న్లు దూర‌మై క‌ష్టాల్లో ఉన్న జ‌బ‌ర్ద‌స్త్ మళ్లీ తిరిగి పూర్వ స్థితిని సొంతం చేసుకోవాలంటే.. కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు. అప్ప‌టి వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM