Jabardasth : అవ‌స‌రం ఉన్నంత కాలం వాడుకుని త‌రువాత వదిలేశారు.. జ‌బ‌ర్ద‌స్త్ పై అప్పారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

Jabardasth : బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న ముఖ్య‌మైన షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ ఒక‌టి. ఈ షో హిట్ అయిన త‌రువాత దీనికి కొన‌సాగింపుగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ అని ఇంకో షో మొద‌లు పెట్టారు. ప్రేక్ష‌కులు ఆ షోను కూడా ఆద‌రించారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి అనేక మంది సీనియ‌ర్ క‌మెడియ‌న్లు కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. అలాగే షోకు గ‌తంలో వ‌చ్చిన రేటింగ్స్ కూడా రావ‌డం లేదు. దీంతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి షోకు ఎలాగైనా రేటింగ్స్ తెప్పించాల‌ని నిర్వాహ‌కులు చూస్తున్నారు. అందులో భాగంగానే వారు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ బెడిసికొడుతున్నాయి. షోకు రేటింగ్స్ పెంచ‌డం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా.. అంటూ ప్రేక్ష‌కులు నిల‌దీస్తున్నారు. అయితే ఈ షో భ‌విత‌వ్యం ఏమ‌వుతుందో తెలియ‌దు కానీ.. అందులో ప‌నిచేసి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు మాత్రం షో నిర్వాహ‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉన్నారు. ఇక ఆస‌మ్ అప్పిగా పేరుగాంచిన అప్పారావు కూడా తాజాగా ఇలాగే ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ను అన్యాయంగా గెంటేశార‌ని అన్నారు.

తాను జ‌బ‌ర్ద‌స్త్ షోలో సీనియ‌ర్ క‌మెడియ‌న్‌ను అని.. అయితే త‌న‌కు ఆ మ‌ర్యాద కూడా ఇవ్వ‌లేద‌న్నారు. జ‌బ‌ర్ద‌స్త్ లో మొదట్లో ష‌క‌ల‌క శంక‌ర్ టీమ్‌లో ప‌నిచేశాన‌ని.. త‌రువాత ర‌చ్చ ర‌వి టీమ్‌లో ప‌నిచేశాన‌ని తెలిపారు. ఆ త‌రువాత పంచ్ ప్ర‌సాద్‌, బుల్లెట్ భాస్క‌ర్ టీమ్ లలోనూ చేశాన‌ని.. త‌రువాత త‌న‌కు ఆస‌మ్ అప్పిగా సోలో టీమ్ లీడ‌ర్ అయ్యే చాన్స్ ఇచ్చార‌ని అన్నారు. అయితే సోలో టీమ్ లీడ‌ర్‌గా కేవ‌లం 11 వారాలు మాత్ర‌మే చేశాన‌ని.. ఆ త‌రువాత క‌రోనా వ‌చ్చింద‌ని.. కొంత కాలం గ్యాప్ త‌రువాత వెళ్తే.. ఇప్పుడు క‌రోనా ఉంది క‌దా.. మీకు వ‌య‌స్సు అయిపోయింది.. కొంత కాలం ఆగి చేద్దురుగాని.. అని అన్నార‌ని.. అయితే తాను చాలా కాలం వారి పిలుపు కోసం ఎదురు చూసినా ఫ‌లితం లేద‌ని అన్నారు.

Jabardasth

చివ‌ర‌కు ఒక రోజు తానే అడిగితే తిరిగి వ‌చ్చి జ‌బ‌ర్ద‌స్త్‌లో చేయ‌మ‌ని చెప్పార‌ని తెలిపారు. అయితే తన‌ను తిరిగి టీమ్ లీడ‌ర్‌గా కొన‌సాగించేది లేద‌ని చెప్పార‌ని.. ఏదైనా టీమ్‌లో చేయాల‌ని సూచించార‌ని అప్పారావు తెలిపారు. అయితే తాను తిరిగి బుల్లెట్ భాస్క‌ర్ టీమ్‌లో ప‌నిచేయ‌న‌ని చెప్పాన‌ని.. అందుకు వారు కూడా ఒప్పుకున్నార‌ని.. చివ‌రకు రాకింగ్ రాకేష్ టీమ్‌లో చేసేందుకు అంగీక‌రించార‌ని అన్నారు. అయితే త‌న‌కు టీమ్ లీడ‌ర్ కాకుండా మేనేజ్‌మెంట్ డైరెక్ట్‌గా పేమెంట్ ఇవ్వాల‌ని అడిగాన‌ని అప్పారావు తెలిపారు. కానీ అందుకు నిర్వాహ‌కులు ఒప్పుకోలేద‌ని అన్నారు. ఇక చివ‌ర‌కు ఎన్‌వోసీ అడిగితే వెంట‌నే ఇచ్చార‌ని.. కానీ తాను ఎందుకు ఎన్‌వోసీ అడుగుతున్న‌ది.. ఎందుకు మానేస్తున్న‌ది.. క‌నుక్కునే ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని.. ఇది త‌న‌కు ఎంత‌గానో బాధ‌ను క‌లిగించింద‌ని అప్పారావు అన్నారు.

ఒక సీనియ‌ర్ క‌మెడియ‌న్ ప‌ట్ల జ‌బ‌ర్ద‌స్త్ నిర్వాహ‌కులు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం త‌న‌కు ఎంత‌గానో బాధ‌ను క‌లిగించింద‌న్నారు. అయితే ఇన్ని అవ‌మానాలు భరించ‌లేకే తానే జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని అప్పారావు తెలిపారు. వారు త‌న‌ను అవ‌స‌రం ఉన్న‌న్ని రోజులు వాడుకుని అవ‌స‌రం తీరాక వ‌దిలేశార‌ని బాధ‌ప‌డ్డారు. అయితే త‌న‌కు ఇప్పుడు ఎంతో పేరు వ‌చ్చింద‌ని.. టీవీ షోల క‌న్నా బ‌య‌ట ఈవెంట్ల ద్వారా తాను నెల‌లో 20 రోజులు బిజీగా ఉంటున్నాన‌ని.. క‌నుక త‌న‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేద‌ని అప్పారావు అన్నారు. ఇక ఇత‌ర టీవీల‌కు చెందిన షోల నిర్వాహ‌కులు కూడా త‌మ షోల‌లో చేయాల‌ని అడుగుతున్నార‌ని.. వీలు చూసుకుని ఓకే చెబుతాన‌ని.. అప్పారావు స్ప‌ష్టం చేశారు. కాగా అప్పారావు చేసిన ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM