IPL : లోగోను ఆవిష్కరించిన ఐపీఎల్‌ లక్నో టీమ్‌..!

IPL : ఈ ఏడాది ఐపీఎల్‌లో మరో రెండు కొత్త టీమ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌, లక్నో టీమ్‌లు ఈ సారి ఐపీఎల్‌లో సందడి చేయనున్నాయి. ఈ క్రమంలోనే లక్నో టీమ్‌ శరవేగంగా పనులు చేస్తోంది. తమ జట్టుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఇప్పటికే నియమించింది. అలాగే లక్నో సూపర్‌ జియాంట్స్‌ పేరిట జట్టుకు ఇటీవలే నామకరణం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం జట్టు లోగోను ఆవిష్కరించారు. ఇది సరికొత్త రీతిలో ఆకట్టుకుంటోంది.

IPL Lucknow Team KL Rahul

లక్నో సూపర్‌ జియాంట్స్‌ టీమ్‌ కొత్త లోగోను భారత త్రివర్ణ పతాకం మోడల్‌లో తీర్చిదిద్దారు. పక్షి రెక్కలు విప్పుకున్నట్లుగా భారత జాతీయ పతాకంలోని రంగులను ఆవిష్కరించారు. మధ్యలో ఒక బ్యాట్‌ను ఉంచారు. కింద లక్నో సూపర్‌ జియాంట్స్‌ అని జట్టు పేరు పెట్టారు. ఇదే లోగోతో ఈ టీమ్‌ ఈసారి ఐపీఎల్‌లో బరిలోకి దిగనుంది. మరి ఈ జట్టుకు తొలిసారిగా అదృష్టం కలసి వచ్చి ట్రోఫీని లిఫ్ట్‌ చేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

IPL : కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా..

లక్నో టీమ్‌ లోగోను తాజాగా ఆ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ట్విట్టర్‌లో ఆవిష్కరించింది. లక్నో టీమ్‌ను ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ రూ.7090 కోట్ల భారీ మొత్తంతో టెండర్‌లో దక్కించుకుంది. గతంలో ఇదే గ్రూప్‌ పూణె టీమ్‌ను సొంతం చేసుకోగా.. దాదాపుగా అదేలాంటి పేరును లక్నోకు పెట్టారు. కేవలం సిటీ పేరు మాత్రమే మారింది. ఇక కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించుకున్నందుకు అతనికి రూ.17 కోట్ల వేతనం ఇవ్వనున్నారు. అలాగే ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ కు రూ.9.2 కోట్లు ఇచ్చి టీమ్‌లోకి తీసుకున్నారు. దీంతోపాటు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను రూ.4 కోట్లతో టీమ్‌లోకి తీసుకున్నారు.

కాగా ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో ఐపీఎల్‌ మెగా వేలం 2022 నిర్వహించనున్నారు. అందులో ఏకంగా 1000 కి పైగా ప్లేయర్లకు వేలం వేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM