IPL 2022: ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీ 22వ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై చెన్నై విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు చివరి వరకు పోరాడింది. కానీ లక్ష్య సాధనకు కొన్ని పరుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో బెంగళూరుపై చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎట్టకేలకు చెన్నై ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. దీంతో చెన్నై ఫ్యాన్స్ హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌లలో శివమ్ దూబె 95 పరుగులు చేసి రెచ్చిపోగా.. చివరికి నాటౌట్‌గా మిగిలాడు. అలాగే రాబిన్ ఊతప్ప కూడా 88 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక బెంగళూరు బౌలర్లలో హసరంగ 2 వికెట్లు తీయగా.. హేజల్‌వుడ్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. చివరి ఓవర్ వరకు బెంగళూరు బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. వికెట్లు పడుతున్నా స్కోర్ బోర్డ్‌ను ఉరకలెత్తించా. కానీ చివరికి చేయాల్సిన పరుగులు భారీగా పెరిగిపోయాయి. దీంతో బ్యాట్స్‌మెన్ చివర్లో చేతులెత్తేశారు. ఈ క్రమంలో చెన్నై జట్టును విజయం వరించింది. ఇక బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లలో షాబాజ్ అహ్మద్ (41 పరుగులు), సూయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్‌లు చెరో 34 పరుగుల చొప్పున చేశారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఇక చెన్నై బౌలర్లలో మనీష్ 4 వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ముకేష్ చౌదరి, బ్రేవోలకు చెరొక వికెట్ దక్కింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…