మీకు సూర్య నటించిన గజిని సినిమా గుర్తుంది కదా. అందులో అతనికి మెమొరీ లాస్ ఉంటుంది. అప్పటికప్పుడే చూసినవి, విన్నవి.. అన్నీ మరిచిపోతుంటాడు. దీంతో అతను ఫొటోలు తీసి వాటి కింద గుర్తులు పెట్టుకుని జీవిస్తుంటాడు. నిజానికి ఇలా నిజ జీవితంలో జరగడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంటుంది. దాదాపుగా ఈ విధంగా ఎవరికీ జరగదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన 20 ఏళ్ల జ్ఞాపకాలను, జీవితాన్ని మరిచిపోయాడు. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 36 ఏళ్ల డానియెల్ పోర్టర్ కు రూత్ అనే భార్య, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. అయితే డానియెల్ ఒక రోజు తెల్లవారుజామున నిద్రలేవగానే తన గతం మరిచిపోయాడు. ఏకంగా 20 ఏళ్లు వెనక్కి వెళ్లాడు. తనను తాను అద్దంలో చూసుకుని అంతలా మారిపోయానేంటి, వయస్సు మీద పడిందేమిటి, తనకు 16 ఏళ్లే కదా.. అని అన్నాడు. అయితే ఇంట్లో ఉన్న తన భార్యను చూసి గుర్తు పట్టలేదు. బాగా మద్యం సేవించి ఎవరో మహిళతో కలసి నిద్రించానని, అందువల్ల వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నాడు.
కానీ డానియెల్ భార్య రూత్ అతని పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ వారు పరీక్షించి చూశారు. అతనికి Transient Global Amnesia ఉందని చెప్పారు. ఇది అత్యంత అరుదైన వ్యాధి అని, ఇందులో భాగంగా వ్యక్తులు గతాన్ని మరిచిపోతారని వైద్యులు చెప్పారు. అతనికి 20 ఏళ్ల కిందటి విషయాలు మాత్రమే గుర్తున్నాయి. తనకు పెళ్లయింది, కుమార్తె జన్మించింది.. ఇతర విషయాలు ఏవీ గుర్తులేవు. తన భార్య, కుమార్తె, ఇల్లు, ఇతరులను కూడా గుర్తు పట్టలేకపోతున్నాడు.
అయితే అతనికి ప్రస్తుతం వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. దీంతో కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తోంది. త్వరలోనే మళ్లీ గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నిజంగా ఇతని కథ సినిమాలాగే ఉంది కదా..!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…