ఇండియా పై నిషేధం విధించారు… ఇప్పుడా సమస్యతో బాధపడుతున్నారు..!

April 6, 2021 8:22 PM

ఇండియా నుంచి ఎటువంటి దిగుమతులు చేసుకోకూడదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా దిగుమతులపై నిషేధం విధించింది. దాయాది దేశం నుంచి దిగుమతులను నిషేధించడంతో ఇప్పుడు పాకిస్థాన్ అధికంగా చక్కెర కొరత ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చక్కెర ధర 100 రూపాయలు.ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) 50 వేల టన్నుల చక్కెర దిగుమతులకు గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇందులో ఇండియా పేరు లేకపోవడం గమనార్హం.

పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో కూడా ఇదే విధంగా టెండర్లు పిలవగా, ధర ఎక్కువగా ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధంగా టెండర్లు రద్దు చేయడంతో ప్రస్తుతం అక్కడ తీవ్రమైన చక్కర కొరత ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చక్కెర కొరత ఏర్పడడంతో గత వారం ఇండియా నుంచి చక్కెర, పత్తి దిగుమతులకు పాకిస్థాన్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా. పాక్ కేబినెట్ మాత్రం అంగీకరించలేదు.

పాకిస్తాన్ ఈ విధంగా ఇండియా దిగుమతులను నిషేధించడంతో ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలానీ స్పందిస్తూ భారత దేశం కంటే ఎంతో చౌకగా, ఎక్కువ నాణ్యత గల చక్కెరను ఎంతో వేగంగా ఇతర దేశాల నుంచి పొందగలరా అంటూ ఆయన ప్రశ్నించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment