భారత్‌లో ఉంటున్న ఆస్ట్రేలియా వాసులకు ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది. భారత్‌లో గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున కోవిడ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో 14 అంతకన్నా ఎక్కువ రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశానికి వెళ్లకూడదు. వెళితే 66000 డాలర్ల ఫైన్ లేదా 5 ఏళ్ల జైలు శిక్షను విధిస్తారు. ఆస్ట్రేలియా దేశం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఆడుతున్న కొందరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇప్పటికే సొంత దేశానికి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. దీంతో వారు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఇక మరికొందరు ప్లేయర్లు కూడా సొంత దేశానికి వెళ్లిపోతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇక భారత్‌లో సుమారుగా 9000 మంది ఆస్ట్రేలియన్లు ఉంటున్నారని సమాచారం. వారిలో 600 మందికి కోవిడ్ ముప్పు ఉన్నట్లు తెలిసింది. కాగా భారత్ కోవిడ్ వేరియెంట్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తమ పౌరులు రాకూడదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా తెలిపింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…