ఎక్క‌డ చూసినా వందేభార‌త్ ట్రెయిన్ గురించే చ‌ర్చంతా.. అస‌లింత‌కీ ఆ రైలు ఎందుకంత ప్ర‌త్యేకం..? అందులో ఏముంది..?

సికింద్రాబాద్ నుంచి విశాఖ‌ప‌ట్నంకు ఈ మ‌ధ్యే వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్ గా ఈ ట్రెయిన్‌ను ప్రారంభించారు. కేవ‌లం 6 చోట్ల మాత్ర‌మే ఈ ట్రెయిన్ ఆగుతుంది. ఈ క్ర‌మంలోనే వేగంగా వెళ్తుంది క‌నుక 8 గంట‌ల్లోనే గ‌మ్య‌స్థానానికి చేరుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు ఎక్క‌డ చూసినా వందే భార‌త్ రైలు గురించే చ‌ర్చంతా న‌డుస్తోంది. ఇంత‌కీ అస‌లు అందులో అంత ప్ర‌త్యేక‌త ఏముంది.. సాధార‌ణ రైళ్ల‌కు, ఈ రైలుకు మ‌ధ్య తేడాలు ఏమిటి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణ రైలుకు, వందే భార‌త్ రైలుకు మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన తేడా.. వేగం. అవును.. సాధార‌ణ సూప‌ర్ ఫాస్ట్ లేదా ఎక్స్ ప్రెస్ క‌న్నా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే వందే భార‌త్ రైలు ప్ర‌యాణికుల‌ను గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌గ‌ల‌దు. ఈ రైలు గంట‌కు గ‌రిష్టంగా 180 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్తుంది. కానీ మ‌న దేశంలో రైలు ప‌ట్టాలు గంట‌కు 130 కిలోమీట‌ర్ల స్పీడ్‌ను మాత్ర‌మే ఆప‌గ‌ల‌వు. క‌నుక వందే భార‌త్ రైలు కూడా ప్ర‌స్తుతం గంట‌కు 130 కిలోమీట‌ర్ల వేగంతోనే వెళ్తోంది. ఇక ఇత‌ర రైళ్ల‌తో పోలిస్తే ఈ రైలుకు ప్ర‌త్యేక ఇంజిన్ ఉండ‌దు. అందువ‌ల్ల వేగంగా ప్రయాణిస్తుంది. అలాగే త్వ‌ర‌గా వేగం పుంజుకుంటుంది. త్వ‌ర‌గా ఆగుతుంది. క‌నుక స‌మ‌యం చాలా అవుతుంది. దీంతో ప్ర‌యాణికుల‌ను వేగంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌వ‌చ్చు. ఇది వందే భార‌త్ రైలులో ఉన్న ప్ర‌ధాన ప్ర‌త్యేక‌త అని చెప్ప‌వ‌చ్చు.

ఇక ఈ రైలులో ప్ర‌యాణికుల‌కు వైఫై ద్వారా ఇంట‌ర్నెట్ స‌దుపాయం కూడా క‌ల్పిస్తున్నారు. దీనికి తోడు బ‌యో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. వీటిని ట‌చ్ చేయ‌కుండానే ఆటోమేటిగ్గా ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే ఈ రైలు బోగీలు అన్నీ ఫుల్లీ ఆటోమేటిక్‌. రైలు ఆగ‌గానే డోర్లు తెరుచుకుంటాయి. డోర్లు మూసుకుంటేనే మళ్లీ రైలు క‌దులుతుంది. అలాగే బోగీల‌లో డిస్ ప్లేలు ఉంటాయి. వీటి ద్వారా రైలు గురించిన స‌మాచారం తెలుస్తుంది. రైలు ఎంత వేగంతో వెళ్తుంది.. ఏ స్టేష‌న్ రాబోతుంది.. ఏ స్టేష‌న్‌ను దాటేసింది.. వంటి వివ‌రాలు తెలుస్తాయి.

ఈ రైలులో రెండు క్లాస్‌ల‌లో టిక్కెట్ల‌ను అందుబాటులో ఉంచారు. ఒక‌టి ఎక‌నామిక్ క్లాస్‌. ఇంకొక‌టి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌. ఇందులో సీట్లు 360 డిగ్రీల కోణంలో తిరుగుతాయి. ఇక ప్ర‌యాణికులు కొనే టిక్కెట్‌తోనే రైలులో తినేందుకు ఇచ్చే ఆహారం చార్జిలు కూడా వ‌సూలు చేస్తారు. టిక్కెట్ ధ‌ర‌, ఫుడ్ ధ‌ర క‌లిపే చార్జిల‌ను వ‌సూలు చేస్తారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌యాణికుల‌కు స‌మ‌యాన్ని బ‌ట్టి ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, సాయంత్నం స్నాక్స్‌, టీ, కాఫీ, రాత్రి డిన్న‌ర్‌ను అందిస్తారు.

ఇక ఈ ట్రెయిన్‌లో ప్ర‌యాణికుల ర‌క్ష‌ణ కోసం అణువ‌ణువునా సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. అలాగే విక‌లాంగుల కోసం ప్ర‌త్యేక స‌దుపాయాల‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఇక ఈ ట్రెయిన్ త‌యారీకి రూ.100 కోట్ల మేర ఖ‌ర్చ‌వుతుంది. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ట్రెయిన్‌. చెన్నైలోని కోచ్ ఫ్యాక్ట‌రీలో రూపొందించారు. ఒక్కో బోగీ త‌యారీకి సుమారుగా రూ.6 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. ఇక ట్రెయిన్‌లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అలాగే వందే భార‌త్ రైలును ట్రెయిన్ 18 అని కూడా పిలుస్తారు. ఈ ట్రెయిన్‌ను ఎలా డిజైన్ చేశారంటే.. డ్రైవ‌ర్ క్యాబిన్‌ను కూడా చూడ‌వ‌చ్చు. అంత‌టి పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది.

రెగ్యుల‌ర్ రైళ్ల క‌న్నా ఇందులో ప్ర‌యాణికుల ల‌గేజీ కోసం ఎక్కువ స్థ‌లాన్ని అందిస్తున్నారు. ఇక ఆహారాల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు తాజాగా అందించేందుకు కూలింగ్‌, హీటింగ్ సిస్ట‌మ్‌లు ఈ రైలులో అందుబాటులో ఉన్నాయి. ఇక సీట్ల కింద ఫోన్‌, ల్యాప్‌టాప్ చార్జ‌ర్ల‌ను పెట్టుకునేందుకు ప్ర‌త్యేకంగా సాకెట్ల‌ను అందిస్తున్నారు. ఇలా వందే భార‌త్ రైలులో అనేక ప్రత్యేక‌త‌లు ఉన్నాయి. దీంతో విదేశాల్లో రైళ్ల‌లో ప్ర‌యాణించిన అనుభూతి ప్ర‌యాణికుల‌కు క‌లుగుతుంది. అయితే రైలు ప‌ట్టాల‌ను ఇంకా ఆధునీక‌రిస్తే.. అప్పుడు గ‌రిష్ట వేగం (180)తో ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీంతో ఇంకా త్వ‌ర‌గానే గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవచ్చు. అప్పుడు స‌మ‌యం మ‌రింత ఆదా అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…

Tuesday, 17 March 2026, 8:32 PM

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM