Akkineni Family : ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి నట సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి గొప్ప నటుడిగా పేరుగాంచారు. అలాగే ఎన్నో చిత్రాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన వారసుడిగా నాగార్జున సైతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విక్రమ్ సినిమాతో నాగార్జున సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మూవీ సక్సెస్ కాలేకపోయినా తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. శివ మూవీతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే ఆయన స్టార్ స్టేటస్‌ను పొందారు.
ఇక నాగార్జున తరువాత ఇండస్ట్రీలో ఆయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం రాణిస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ మొదట్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ నెమ్మదిగా నిలదొక్కుకుంటున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అభిమానులకు ఎప్పటి నుంచో ఓ సందేహం బలంగా ఉంది. అదేమిటంటే.. అక్కినేని ఫ్యామిలీలో దాదాపుగా అందరి పేర్లకు ముందు నాగ అని వస్తుంది. దీంతో ఈ విషయం చాలా మంది అభిమానుల మెదళ్లను తొలుస్తోంది. అయితే దీనిపై గతంలోనే నాగార్జున ఓసారి క్లారిటీ ఇచ్చారు. తమ ఫ్యామిలీలో అందరి పేర్లకు ముందు నాగ అని ఎందుకు వస్తుందో చెప్పారు. దీనికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే..
నాగేశ్వర్ రావు కడుపులో ఉన్నప్పుడు ఆయన తల్లికి కలలో పాములు కనిపించేవట. దీంతో ఆమె భయపడి తన కొడుక్కి నాగేశ్వర్ రావు అని పేరు పెట్టారు. అయినప్పటికీ ఆమెకు తరచూ పాములు కనిపిస్తూ ఉండేవట. దీంతో ఆమె నాగదేవతకు ప్రత్యేకంగా తరచూ పూజలు చేస్తుండేదట. అంతేకాదు.. తమ కుటుంబంలో పుట్టే పిల్లలకు నాగ అని పేరు వచ్చేలా పెట్టాలని చెప్పిందట. దీంతో నాగేశ్వర్ రావు తన కుమారుడు నాగార్జునకు అలా పేరు పెట్టారు. తరువాత నాగార్జున కూడా నాగ అని వచ్చేలా నాగచైతన్య పేరు పెట్టారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా తెలియజేశారు. అయితే అఖిల్ విషయంలో మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే మొదటి సంతానానికి మాత్రమే అలా పెట్టాలని చెప్పారట. కనుకనే వారికి నాగ అని పేరులో మొదట వస్తుంది. ఇదీ.. ఈ విషయం వెనుక ఉన్న అసలు రహస్యం.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…