బ్రిటిషర్లు మన దేశంలో మొదటిసారి అడుగు పెట్టిన తరువాత చాలా ఏళ్ల పాటు కోల్‌కతాను రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత రాజధానిని ఢిల్లీకి మార్చారు. అయితే అక్కడ వారు ఉపయోగించిన ఓ భవనాన్ని ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ భవనంగా వాడుతున్నారు. ఆ భవనంలో తాజాగా ఓ సొరంగ మార్గం బయట పడింది. దాని నుంచి దారి ఢిల్లీలోని ఎర్ర కోట వరకు ఉండడం విశేషం.
ఢిల్లీ అసెంబ్లీ భవనంలో తాజాగా ఓ సొరంగ మార్గాన్ని గుర్తించారు. దీనిపై స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ మాట్లాడుతూ.. 1993లోనే తనకు ఈ విషయం తెలుసని అన్నారు. అయితే అప్పట్లో దీని గురించి చదివానని, కానీ ఆధారాలు లభించలేదని అన్నారు. కానీ తాజాగా ఇప్పుడే సొరంగాన్ని కనుగొన్నామని తెలిపారు. సొరంగ మార్గం మొత్తాన్ని గుర్తించామని, అది అసెంబ్లీ నుంచి ఢిల్లీలోని ఎర్ర కోట వరకు ఉందని తెలిపారు.
అయితే సొరంగంలో ప్రస్తుతం కొంత వరకు భాగం మాత్రమే ఖాళీగా ఉందని, మిగిలిన భాగంలో మట్టి, భవన నిర్మాణ వ్యర్థాలు నిండిపోయాయని, అందువల్ల సొరంగంలో ఇప్పుడు వెళ్లలేమని తెలిపారు. కానీ దాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టామని అవి 2022 ఆగస్టు 15 వరకు పూర్తవుతాయని అన్నారు. దీంతో ఆ సొరంగంలో పర్యాటకులు ప్రయాణించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
అయితే 1912వ సంవత్సరంలో బ్రిటిష్ వారు తమ రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చగా అప్పటి నుంచి ఈ భవనంలోనే వారు ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించడం మొదలు పెట్టారు. ఈ భవనాన్ని అప్పట్లో వారు కోర్టుగా ఉపయోగించారు. వారు ఎర్ర కోట నుంచి పలువురు స్వాతంత్య్ర సమర యోధులను సొరంగ మార్గం ద్వారా ఈ కోర్టుకు తెచ్చి వారికి శిక్షలు విధించేవారు. తరువాత ఈ మార్గం ద్వారానే వాళ్లను బయటకు తరలించేవారు.
కానీ కాలక్రమేణా దాని గురించిన వివరాలు చరిత్రలో మరుగున పడిపోవడంతోపాటు సొరంగ మార్గం చాలా వరకు పూడుకుపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆ సొరంగాన్ని మళ్లీ గుర్తించారు. దీంతో దాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టారు.
అయితే సదరు సొరంగం మార్గం ఎంత పొడవు ఉంటుందో తెలియదు కానీ దాన్ని పూర్తిగా పునరుద్ధరించాక అన్ని వివరాలు తెలుస్తాయి. ఇక ఆ సొరంగాన్ని అందుబాటులోకి తెస్తే స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాల గురించి మనకు కళ్లకు కట్టినట్లు తెలుస్తుందని స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ఈ సొరంగ మార్గం గురించి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…