దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరం కావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వారం రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే వలస కూలీలు సొంతూళ్లకు వెళ్ళడానికి క్యూ కట్టారు. ఇప్పటివరకు వీకెండ్, రాత్రి సమయంలో కర్ఫ్యూ నిబంధనలు ఉన్నప్పటికీ సోమవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో వేలాది మంది వలస కూలీలు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు.
ఒక్కసారిగా కూలీలు అందరూ సొంతూళ్లకు పయనం కావడంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి.ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై ఇసుకేస్తే రాలనంతగా జనాలతో నిండిపోయాయి. ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ కరోనా కేంద్రంగా మారిపోయింది. తమ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం టెర్మినల్ గోడలను దూకుతూ పూర్తిగా కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు.
కేవలం వారం రోజుల పాటు లాక్ డౌన్ అని ప్రకటించినప్పటికీ తరువాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో గతేడాది మాదిరిగా ఎన్నో బాధలు అనుభవించకుండా, వారి ఉపాధిని కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలతో వలస కూలీలు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. సోమవారం ఒక్కరోజే బీహార్, యూపీ ప్రాంతాలలో దాదాపు20 వేల మంది వలస కూలీలు నాలుగు వందల బస్సులలో ప్రయాణించినట్టు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…