క‌న్నీరు పెట్టిస్తున్న డాక్ట‌ర్ ఫేస్‌బుక్‌ పోస్టు.. ఇదే చివ‌రి పోస్టు అని పెట్టాక ఒక రోజుకు మృతి చెందింది..

April 21, 2021 2:21 PM

మ‌హ‌మ్మారి క‌రోనా ఎంతో మందిని త‌మ ఆత్మీయుల‌కు దూరం చేసింది. చివ‌రి చూపులకు కూడా నోచుకుండా చేస్తోంది. త‌మ ఆత్మీయుల‌ను క‌డ‌సారి చూసేందుకు కూడా వీలు లేకుండా చేసింది మాయ‌దారి క‌రోనా. ఈ క్ర‌మంలోనే ఎన్నో ల‌క్ష‌ల మంది ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా చ‌నిపోయారు. అనేక చోట్ల శ్మ‌శానాల్లో కుప్ప‌లు తెప్ప‌లుగా క‌రోనా మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తున్నారు. కాగా క‌రోనా బారిన ప‌డ్డ ఓ డాక్ట‌ర్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు అంద‌రినీ కంట త‌డి పెట్టిస్తోంది.

doctor last post on facebook she died of covid

ముంబైకి చెందిన సెవ్రి టీబీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ మ‌నీషా జాద‌వ్‌కు క‌రోనా సోకింది. అయితే ఆమె ప‌రిస్థితి విష‌మంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఆమె ఇటీవ‌లే ఓ రోజు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఇదే నాకు చివ‌రి గుడ్ మార్నింగ్‌. ఇదే చివ‌రి పోస్టు. ఇక‌పై ఈ ప్లాట్‌ఫాంలో మిమ్మ‌ల్ని క‌లుసుకోలేను. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి. శ‌రీరం చ‌నిపోతుంది. ఆత్మ కాదు. ఆత్మ‌కు మ‌ర‌ణం లేదు. అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. ఈ క్ర‌మంలో ఆమె పోస్టు పెట్టిన మ‌రుస‌టి రోజు మృతి చెందింది. దీంతో ఆమె పోస్టు వైర‌ల్‌గా మారింది.

ఆ డాక్ట‌ర్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు అంద‌రినీ విచారానికి గురి చేస్తోంది. అంద‌రినీ క‌న్నీరు పెట్టిస్తోంది. దిక్కుమాలిన క‌రోనా ఇంకెంత‌మందిని బ‌లి తీసుకుంటుందో క‌దా అంటూ అంద‌రూ క‌రోనాను తిట్టిపోస్తున్నారు. కాగా మ‌హారాష్ట్ర‌లో ప్ర‌స్తుతం కోవిడ్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ 18వేల మంది డాక్ట‌ర్ల‌కు కోవిడ్ సోక‌గా వారిలో 168 మంది చ‌నిపోయార‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now