ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇరవై రోజుల క్రితం వరకు దేశం మొత్తం కేవలం లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉండగా ఈ 20 రోజులలో యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 8 లక్షలు దాటింది. అదేవిధంగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ విధంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేశారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలలో మరింత కఠినమైన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని ఈ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది.
రాబోయే నాలుగు వారాలలో కరోనా పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. నిర్లక్ష్యం వహించకుండా కరోనా జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా ఈ మహమ్మరి నుంచి బయటపడోచ్చని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కొందరు 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని,ప్రస్తుతం అవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…