India vs Newzealand : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో జరిగిన పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ కష్టపడుతూ ఛేదించింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లలో మార్టిన్ గప్తిల్, మార్క్ చాప్‌మన్‌లు అర్ధ సెంచరీలతో రాణించారు. 42 బంతులు ఆడిన గప్తిల్ 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేయగా.. మార్క్ చాప్‌మన్ 50 బంతులు ఆడి 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్‌లు 2 వికెట్ల చొప్పున తీశారు. దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్ లు చెరొక వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రోహిత్ శర్మలు రాణించారు. 40 బంతులు ఆడిన యాదవ్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, 36 బంతుల్లో రోహిత్ శర్మ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. టిమ్ సౌతీ, మిచెల్ శాన్టనర్, డెరిల్ మిచెల్‌లకు తలా 1 వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో విజయంతో ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. మరో 2 టీ20లు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…