Arjun Reddy : విజయ్ దేవరకొండ, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా సందీప్ వంగా దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలను సృష్టించింది. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని రీమేక్ చేశారు. అయితే వాస్తవానికి అర్జున్ రెడ్డి సినిమా మన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల దాన్నుంచి మనం పలు విషయాలను నేర్చుకోవచ్చు. అవేమిటంటే..
పర్సనల్ గా ప్రాబ్లమ్ వచ్చింది అని కెరీర్ ను ఎప్పటికీ వదులుకోకు. అసలే ఈ మధ్య లవ్ ఫెయిల్ అయ్యిందని సూసైడ్ చేసుకునే వారు ఎక్కువైపోయారు. సినిమాలో ప్రీతి వదిలేసినా కూడా అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. కనుక లవ్ ఫెయిల్ అయితే అదే జీవితం కాదని.. ఇంకా ఉందని గుర్తుంచుకోవాలి. కెరీర్‌లో ముందుకు సాగాలి. అలాగే సినిమాలో అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ ఒకేలా ఉంటుంది. కాలేజీ పరువు తీస్తున్నావని అన్నా.. అతను తన వ్యక్తిత్వాన్ని వదులుకోడు. అవును.. ఎవరూ కూడా తమ వ్యక్తిత్వాన్ని ఇంకో వ్యక్తి వద్ద తాకట్టు పెట్టవద్దు. మనం ముందు నుంచి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అది మంచిదై ఉండాలి. అంతేకానీ దాన్ని మార్చుకోకూడదు.
సినిమాలో ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు అర్జున్ రెడ్డి ఆపలేని స్టేజిలో ఉంటాడు. దానికి కారణం మోర్ఫిన్ తీసుకోవడం. కానీ మనం అలా చేయకూడదు. మనల్ని ప్రేమించే వారిని వదులుకోవాలి అన్న ఆలోచన కూడా రానివ్వద్దు. శివ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా కష్టం. సంతోషంలోనే కాదు బాధల్లో తోడుండే అలాంటి ఫ్రెండ్ ని ఎప్పటికీ వదులుకోవద్దు. శివతో అర్జున్ రెడ్డి పీరియడ్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. మనమేమో అదేదో బూతులాగా చూస్తాము. మన ఆలోచన మంచిది అయినప్పుడు అది బూతు అవ్వదు. ధైర్యంగా మాట్లాడు. మంచోడు అని పేరు తెచ్చుకొని ఏం సాధించడానికి..?
అర్జున్ నానమ్మ సఫర్ అవ్వనివ్వు అంటారు. ఎందుకంటే ఎదుటోడిని బాధ పడకు అని చెప్పగలము కానీ బాధను పంచుకోలేము. నొప్పి తనది కాబట్టి. అర్జున్ నానమ్మ చనిపోయినప్పుడు అర్జున్ ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాడు. అలా చేస్తే ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అర్జున్ కి ప్రీతి గర్భంతో ఉన్నప్పుడు కనిపిస్తుంది. కడుపులో పెరుగుతుంది వేరొకరి బిడ్డ అయినా నా బిడ్డగా పెరుగుతుంది అని చెప్తాడు. నిజంగా ప్రేమించడం అంటే అది. చివరికి అది తన బిడ్డే అని తెలుస్తుంది.
ఆపరేషన్ అర్జెంటు అంటే తన పరిస్థితి బాలేకున్న వెళ్తాడు. తర్వాత డాక్టర్ చదివేటప్పుడు చేసిన ప్రామిస్ గుర్తుతెచ్చుకుంటాడు. నాకు నా లైఫ్ లో నచ్చింది కెరీర్ ఒక్కటే అంటాడు. ప్రీతికి టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని తీసుకెళ్తాడు. ప్రతి సరి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనుకుంటాము. కానీ డాక్టర్ ప్రొఫెషన్ గొప్పతనం చెప్తాడు. ఇంకోసారి టాపిక్ గురించి వచ్చినప్పుడు అప్పటికి ఆ అమ్మాయితో తనకి రిలేషన్ లేదు కాబట్టి ఇబ్బంది పడి వెళ్లిపోతాడు. కనుక ఈ విషయాలన్నింటినీ మనం నిజ జీవితంలోనూ గుర్తుంచుకుని అనుసరించవచ్చు. అయితే అందరికీ ఇది సరిపోతుందని చెప్పలేము. ఎవరి వ్యక్తిత్వం వారిది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…