Ileana : మేక‌ప్ లేకుండా ఇలియానా పోస్ట్‌.. ఫొటో వైర‌ల్..!

February 19, 2022 8:14 PM

Ileana : న‌టి ఇలియానా ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. అయితే ఇలియానా గ‌తంలో మాదిరిగా కాదు. ఈ మ‌ధ్య కాలంలో ఎప్పుడూ మేక‌ప్ లేకుండానే క‌నిపిస్తోంది. అలాగే మొన్నీ మ‌ధ్యే ఒక ఫొటో షేర్ చేసి త‌న అస‌లు రూపం ఇదేన‌ని.. ఇన్ని రోజులూ త‌నను స‌న్న‌గా చూపించే యాప్స్‌ను వాడాన‌ని.. కానీ వాటిని ఫోన్ నుంచి తీసేశాన‌ని చెప్పింది. ఇక తాజాగా మ‌రో ఫొటో షేర్ చేసి ఆమె అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Ileana  shared her photo without makeup
Ileana

ఇలియానా మేక‌ప్ లేకుండానే ఈ మ‌ధ్య కాలంలో ఫొటోల‌ను షేర్ చేస్తోంది. దీంతో ఆ ఫొటోల‌ను చూసి నెటిజ‌న్లు అవాక్క‌వుతున్నారు. ఇలియానా అస‌లు రూపం ఇదా.. అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటో వైరల్ మారింది.

ఇలియాన 2020లో ఆండ్రూ నీబోన్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. అయితే అత‌న్ని ఆమె త‌న భ‌ర్త‌గా చెప్పింది కానీ వారి పెళ్లి జ‌రిగిన‌ట్లు ఆమె ఎక్క‌డా చెప్ప‌లేదు. దీంతో వారు రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారనే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఈ విష‌యాన్ని ఇలియానా కూడా స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా పోస్టుల ద్వారా తెలియ‌జేసింది. అయితే ఆండ్రూకు బ్రేక‌ప్ చెప్పిన త‌రువాత ఆ విష‌యాన్ని కూడా ఆమె ఓపెన్‌గానే చెప్పేసింది. అప్ప‌టి నుంచి ఇలియానా ఇలాంటి ఫొటోల‌ను పోస్ట్ చేస్తోంది. దీంతో ఆమె వైరాగ్యంలో ఉంద‌ని అంటున్నారు. మ‌రి ముందు ముందు అయినా ఈమెకు త‌గిన జోడీ ఇంకెవ‌రైనా ల‌భిస్తారో, లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now