Ileana : పెళ్లి కూతురు గెట‌ప్‌లో.. అదిరిపోయిన ఇలియానా..!

January 27, 2022 12:37 PM

Ileana : గోవా బ్యూటీ ఇలియానా సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. బికినీలు ధ‌రించిన దిగిన ఫొటోల‌ను వ‌రుస‌గా షేర్ చేస్తూ మ‌తులు పోగొడుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన ఫొటో ఒక‌టి వైర‌ల్‌గా మారింది. పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఇలియానా మెరిసిపోతోంది.

Ileana new bridal dress trending in social media

ఎరుపు రంగులో ఉన్న లెహంగా, దాని మీద టాప్ ధ‌రంచింది. కింద షూస్ వేసుకుంది. అనంత‌రం ఓ స్టేష‌న‌రీ బైక్‌పై కూర్చుని పోజిచ్చింది. మొత్తంగా చూస్తే ఓ మోడ్ర‌న్ పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఇలియానా ద‌ర్శ‌న‌మిస్తోంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఇలియానా పెళ్లిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇలియానాకు ప్ర‌స్తుతం పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈమె గ్లామ‌ర్ షోలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. త‌న ప్రియుడికి బ్రేక‌ప్ చెప్పిన అనంత‌రం చాలా కాలం పాటు డిప్రెష‌న్‌లో ఉన్న ఈమె మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివ్‌గా ఉంటోంది. భ‌విష్య‌త్తులో ఈమెకు మ‌ళ్లీ అవ‌కాశాలు వ‌స్తాయా.. లేక‌.. ఎవ‌రితో అయినా మ‌ళ్లీ ల‌వ్‌లో ప‌డి పెళ్లి వైపు అడుగులు వేస్తుందా..? అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now