Ileana : బాబోయ్ ఇలియానా అందాల ఆర‌బోత.. మామూలుగా లేదుగా..!

April 9, 2022 2:25 PM

Ileana : ఒకప్పుడు సౌత్ లో కుర్ర‌కారు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. దేవదాసు అనే సినిమాతో ఇలియానా హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో అద్భుతమైన నటనతోపాటు అందంతోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. దీంతో దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ పట్టేసింది. తద్వారా స్టార్‌ హీరోయిన్‌గా హవాను చూపించి క్రష్‌గా మారిపోయింది. పోకిరి సినిమాతో ఇలియానా రేంజ్ మ‌రోలా పెరిగింది. తెలుగులో స‌త్తా చాటిన ఈ అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి వెళ్లి అక్క‌డ చేతులు కాల్చుకుంది. చాలా రోజుల పాటు సినిమాల‌కు దూరంగా ఉంది.

Ileana attracts her fans with modern and trendy dress
Ileana

కొంత‌ గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. అయితే ఇలియానా మళ్లీ తన కెరీర్‌ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే అన్ని భాషల్లోనూ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో పలు చిత్రాలను కూడా చేసింది. అలాగే కొన్నింటిని చేస్తోంది. ఇక తెలుగులోకి కూడా మళ్లీ ప్రవేశించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే త‌న అందాతో నిర్మాత‌ల‌కు గాలం వేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు క‌నిపించేలా క్లీవేజ్ షో చేస్తూ కేక పెట్టించింది.

ఇలియానాని ఇలా చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఆమె స్ట‌న్నింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం ఇలియానా ఫొటోలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీంతో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైమ్‌ పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలోనూ మాట్లాడుతూ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now