Venus Holes : సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కొందరు తమ శరీర భాగాలను బాగా వంచగలుగుతారు. కొందరికి శరీర భాగాలను కదిలించే ప్రత్యేకత ఉంటుంది. ఇలా కొందరికి భిన్నమైన ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పబోయేది కూడా ఒకటి. కొందరికి వీపు కింది భాగంలో వెన్నుపై రెండు రంధ్రాల మాదిరిగా ఉంటాయి. వీటిని బయటకు చూసే సులభంగా చెప్పవచ్చు. అయితే ఇవి ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వీపు కింది భాగంలో వెన్నెముకకు ఇరువైపులా రెండు రంధ్రాల మాదిరిగా ఉంటే వాటిని వీనస్ హోల్స్ అని లేదా అపోలో హోల్స్ అని అంటారు. రోమన్ దేవత వీనస్ అందానికి, కోరికలకు, సంతానానికి, శృంగారానికి, సంపదకు, విజయాలకు ప్రతీకగా చెబుతారు. అయితే ఇలాంటి హోల్స్ ఉన్నవారికి రోమన్ సంప్రదాయం ప్రకారం లక్ కలసి వస్తుందట. వారు ధనవంతులు అవుతారట. పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఏ పని చేసినా విజయం సాధిస్తారట. అనుకున్న కోరికలు నెరవేరుతాయట.
ఇక ఇలాంటి వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట. చక్కని సంతానం కలగడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారట. అలాగే శృంగారంలోనూ చురుగ్గా పాల్గొంటారట. ఇలాంటి రంధ్రాలు కలిగిన స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సరే.. ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారట. ఇలా ఈ రంధ్రాలు అనేక విధాలుగా అదృష్టాన్ని తెచ్చి పెడతాయని రోమన్లు ఇప్పటికీ విశ్వసిస్తారు.
అయితే ఈ వీనస్ హోల్స్ జన్యు పరంగా ఏర్పడుతాయి. వంశ పారంపర్యంగా కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. కొందరికి యాదృచ్ఛికంగా కూడా ఇవి వస్తాయి. కానీ వీటిని యోగా, వ్యాయామం, జిమ్ వంటివి చేసి తెప్పించలేము. పుట్టుకతోనే ఇవి రావల్సి ఉంటుంది. అలాంటి వారు నిజంగా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…