Heart Attack : పిడికెడంత గుండె మన శరీరాన్ని మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంటుంది. శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తూ నిరంతరం అలుపు ఎరుగని యోధుడిలా పని చేస్తూనే ఉంటుంది. కానీ కొందరు అనారోగ్యకరమైన జీవనశైలితో, చెడు వ్యసనాలతో గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలతో తమ చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే గుండె మన శరీరంలో నిరంతరం పనిచేసే ముఖ్యమైన భాగాలలో ఒకటి. నేటి కాలంలో గుండె సంబంధిత సమస్యల వలన అనేక మంది మరణించడం జరుగుతోంది.
ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్న వారిలో 35 నుంచి 40 సంవత్సరాల వయస్సులోని ప్రజలు ఎక్కువగా గుండెపోటు సమస్యకు గురవుతున్నారు. మారుతున్న జీవన శైలిని బట్టి అధిక రక్తపోటు తలెత్తడం, గుండెకు ప్రసారమయ్యే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, అధిక బరువు వంటి సమస్యల వలన గుండెపోటు రావడం, గుండె పెరిగిపోవడం ఈ సమస్యలు తలెత్తుతూ చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ కారణం మన జీవనశైలి, తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే అని చెప్పవచ్చు.
ఎప్పుడైతే గుండె బలహీనంగా ఉంటుందో మనకు కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలలో మొదటిది వికారం, ఛాతిలో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడైతే మన గుండె బలహీనంగా ఉంటుందో రక్తపోటు అనేది మన అదుపులో ఉండదు. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడితే గుండె పోటు సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితి కనిపిస్తే రక్తపోటును అనేది ఏ స్థాయిలో ఉంది అని తనిఖీ చేయించుకోవడం ఎంతో అవసరం. గుండె ఎప్పుడు బలహీనంగా ఉంటుందో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. అంతే కాకుండా నిరంతర జలుబు సమస్య అనేది గుండె బలహీనతకు ఒక లక్షణంగా చెప్పవచ్చు. ఎప్పుడైతే శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయో గుండె బలహీనంగా ఉందని సూచనలు కనిపిస్తాయి. వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గి ఈ సమస్యలు మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే సమస్య తీవ్రంగా ఉంది అనిపిస్తుందో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఎంతో ఉత్తమం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…