Currency Notes : సాధారణంగా మన వద్దకు అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన నాణేలు, నోట్లు వస్తుంటాయి. వాటిని చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. అయితే వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించాలనే కానీ లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అలాంటి కాయిన్స్, కరెన్సీ నోట్లను విక్రయించే సైట్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా అలాంటి నాణేలు, నోట్లను మనం సులభంగా విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఇక అలాంటి నోట్లలో 786 అనే నంబర్ ఉన్న నోట్లు ఒకటి. ఈ నంబర్‌ను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నంబర్ ఉన్న నోట్లు తమ వద్ద ఉంటే అదృష్టం కలసి వస్తుందని.. అనుకున్నవి నెరవేరుతాయని.. ధనవంతులు అవుతారని విశ్వసిస్తారు. కనుకనే ఈ నంబర్ ఉండే నోట్లను చాలా మంది కొంటుంటారు. ఇక ఇలాంటి నోట్లు మీ దగ్గర కూడా ఉంటే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు.
786 అనే నంబర్‌లో ఉండే నోట్లను విక్రయించాలంటే అందుకు ఈబే అనే సైట్‌ను సందర్శించాలి. అందులో రిజిస్టర్ అయ్యాక లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఉండే నోట్లకు చెందిన ఫొటోలను తీసి అందులో యాడ్ పెట్టాలి. అప్పుడు కావల్సిన వారు ఆ నోట్లను కొంటారు. మీకు డబ్బు చెల్లిస్తారు. ఇలా ఈ నోట్లను అమ్మవచ్చు.
ఇక మాతా వైష్ణోదేవికి ఫొటోతో కూడిన నాణేలను 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవి చాలా అరుదైన కాయిన్స్. వీటిని అధిక ధరలకు చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ నాణేలను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని.. ధనం బాగా సంపాదించవచ్చని నమ్ముతారు. కనుకనే ఈ నాణేలను కూడా చాలా మంది కొంటున్నారు. ఇక ఈ నాణేలు మీ దగ్గర ఉంటే కాయిన్ బజార్ అనే సైట్‌లో వీటిని విక్రయించి డబ్బులు పొందవచ్చు. ఇలా మీ దగ్గర ఉండే ప్రత్యేక నాణేలు, నోట్లతోపాటు పాత కాయిన్స్ ను, నోట్లను కూడా ఆయా సైట్లలో విక్రయించి డబ్బులు సంపాదించవచ్చు. అయితే వీటిని అమ్మేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు పాటించండి. లేదంటే సైబర్ నేరగాళ్ల బారిన పడతారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…