House Main Door : ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో ధనము లేనిదే మానవ సంబంధాలకు కూడా విలువ లేకుండా పోతోంది. అలాంటి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి. ఆమె కటాక్షం ఉన్నప్పుడే ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయి. అలాంటి లక్ష్మీదేవి కటాక్షం మనకి కలగాలంటే ఇంటి ద్వారం దగ్గర కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కోసం మనం చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఎంత కష్టపడినా చివరకు ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ వర్క్ టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందులు, మానసిక రుగ్మతలతో సరైన నిద్ర లేకుండా అశాంతికి లోనవుతారు. ఇలా అశాంతికి లోనవటం అనేది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనికి కారణంగా ఇంట్లో లక్ష్మీదేవికి బదులు జ్యేష్టాదేవి కొలువై ఉండడం. మరి జ్యేష్టాదేవిని ఇంటి నుంచి బయటకు పంపి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలి అంటే మనం చెప్పుకునే ఈ పద్ధతి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
మనం మొదటిగా ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాం. లక్ష్మీ దేవిగా భావించి ఇంటి గుమ్మానికి మంగళవారం, శుక్రవారం పసుపు రాయడం వలన నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్లి లక్ష్మీదేవి ఇంటికి ఆహ్వానించబడుతుంది. అదేవిధంగా ఇంటి సింహ ద్వారం ఎదురుగా ఎటువంటి చెడు దృష్టి లోనికి రాకుండా బూడిద గుమ్మడి కాయను కట్టాలి. ఇలా కట్టడం వల్ల చెడు దృష్టి అనేది మన ఇంటిలో ప్రవేశించకుండా ఇంటిలో వారికి మానసిక ప్రశాంతతను, ఆరోగ్యం కలుగజేస్తుంది. ఎప్పుడైతే ఇంట్లోని వారు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో లక్ష్మీ కృప ఎల్లవేళలా కలుగుతుంది.
గుమ్మడికాయలో జీవశక్తి ఉండడంవల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే మనం కట్టిన గుమ్మడికాయ పదిహేను రోజుల లోపు కుళ్ళి పోతుందో దాన్నిబట్టి నరదృష్టి ఎంత ఉన్నదనే విషయం అర్థమవుతుంది. ఈ కుళ్ళిపోయిన గుమ్మడికాయ స్థానంలో మరొక గుమ్మడికాయను ప్రతిష్టించాలి. అదేవిధంగా కలబంద కూడా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే ఇంట్లోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉండి సిరిసంపదలను కలగజేస్తుంది. కనుక ఈ విధమైన సూచనలను పాటించడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఆర్థిక సమస్యలు ఉండవు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…