Type 2 Diabetes : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. కొన్ని గణాంకాల ప్రకారం, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. డయాబెటిస్ అనేది టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. డయాబెటిస్ వ్యాధిని సరైన సమయంలో నియంత్రించకపోతే, దాని ప్రభావం శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దీని ప్రభావం కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కళ్లపై కూడా కనిపిస్తుంది.
మధుమేహం అనేది అన్ని వయసుల వారిపైన ప్రభావితం చేస్తుంది. సరైన ఆహారం, జీవన శైలి లేకపోవడం, కుటుంబ చరిత్ర మధుమేహం రావడానికి కారణాలుగా చేపవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కార్బోహైడ్రేట్లు, కార్బోనేటేడ్ పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చక్కెర అధికంగా కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించడం, ఎక్కువ ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్ తినడంతో మధుమేహాన్ని నివారించవచ్చు అని నిపుణులు వెల్లడిస్తున్నారు.
స్టాక్‌హోమ్‌లోని యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ వార్షిక సమావేశంలో సమర్పించిన 2022 అధ్యయనాల ప్రకారం టీని రోజులో ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్ పేషెంట్ కి ప్రయోజనం కనిపిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మధుమేహం ఉన్నవారు గ్రీన్ టీ తీసుకుంటే దీనిలో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ను కలిగి ఉండటం వ్లల ఇన్సులిన్ కణాల సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహం ఉన్నవారు ఎలాంటి రకాల టీలు తీసుకోవాలంటే నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఊలాంగ్ టీని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలోకి వస్తుంది. కానీ టీలో చక్కెర కలిపి తీసుకోవడం వలన టీ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయి. చక్కెర కలిపి టీని తీసుకోవడం వలన బరువు పెరిగేలా చేస్తుంది. డయాబెటిస్ పేషెంట్ ఏదైనా ఆహార విషయంలో మార్పులు చేసేముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…