Onions : పచ్చి ఉల్లిపాయల‌ను తింటున్నారా..! అయితే ఈ విషయాల‌ను క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Onions : మనం ప్రతి రోజు ఉల్లిపాయను ఏదో విధంగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎంత ఖరీదైనా సరే ఇంటిలో ఉల్లిపాయలు ఉండి తీరాల్సిందే. ఎక్కువగా ఉల్లిపాయను  కూరల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కొందరు పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. పల్లెటూరులో చాలామందికి పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. అయితే పచ్చి ఉల్లిపాయ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుంటే క‌చ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది.

ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే థియోసల్ఫినేట్‌ రక్తం యొక్క స్థిరత్వాన్ని సక్రమంగా ఉంచడమే కాకుండా రక్తం పలుచగా ఉండేలా చేయటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలను దరిచేరనివ్వదు. ఉల్లిపాయలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

Onions

ఉల్లిపాయలో ఉండే సెలీనియం విటమిన్ ఇ ని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ ఇ అనేది కంటి సమస్యలను తగ్గిస్తుంది. కంటి డ్రాప్స్‌లో కూడా ఉల్లిపాయ రసంని ఉపయోగిస్తారు. ఆడవారికి మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో ఉల్లిపాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. క్యాన్సర్, మధుమేహం, గుండె మరియు క్యాన్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంధ‌ సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఉల్లిపాయలో ఉండే ఫ్లేవనాయిడ్లు శ్వాసనాళం యొక్క కండరాలపై  ప్రభావాన్ని చూపటం వలన ఆస్తమా రోగులకు సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి సహకరిస్తాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఈ సీజన్ లో వచ్చే గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని కూడా తగ్గించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM