Laya : నెట్టింట లయ రచ్చ.. డీజే టిల్లు సాంగ్ కు త‌ల్లీ కూతుళ్ల మాస్ డ్యాన్స్.. వీడియో..

Laya : అందం, అభినయంతో ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసింది అందాల తార లయ. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 60 సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అలనాటి అందాల తార హీరోయిన్ లయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.

కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటుంది. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్‏కు స్టెప్పులేసి అదరగొట్టిన లయ.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసింది. ల‌య త‌న కూతురు శ్లోకాతో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సిద్దు జొన్న‌ల‌డ్డ న‌టించిన రీసెంట్ మూవీ డీజే టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ డీజే టిల్లుకి.. త‌ల్లీకూతుళ్లు మాస్ డ్యాన్స్ ఇర‌గ‌దీశారు. నెటిజ‌న్స్ లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Laya

అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లయ యూఎస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఓ ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకొని కాలిఫోర్నియాలోని లాస్ ఏంజ‌ల్స్‌లో సెటిలైంది లయ. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంది. ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆ మధ్య రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలో తన కూతురు శ్లోకతో కలిసి నటించింది లయ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM