Onions : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం చాలాసార్లు వినే ఉంటాం. పల్లెటూరిలో చాలా మంది ఉదయాన్నే చద్దన్నంతో పచ్చి ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు, పోషకాల వల్ల మన పెద్దలు ఈ సామెతను చెబుతూ ఉంటారు. వీటిలో అనేక ఔషధాలతోపాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, సల్ఫర్ లాంటివి కూడా ఉల్లిలో ఉన్నాయి. ఉల్లిపాయ గురించి ఇన్ని విషయాలు చాలా మందికి తెలియక పోయినా.. ఉల్లిని ప్రతి ఒక్కరూ నిత్యం ఆహారంలో ఉపయోగిస్తుంటారు. ఉల్లి లేని ఇల్లు అసలు ఇల్లు కాదనే చెప్పొచ్చు. ఉల్లిపాయ లేకుండా కూర చేయడం మాత్రం అస్సలు జరిగే పనే కాదు. కేజీ ఉల్లిపాయ ధర 100 రూపాయలు ఉన్నా కూడా ఇంటిలో ఉల్లిపాయి ఉండవలసిందే.
ఉల్లిపాయలో ఉండే థియోసల్ఫినేట్ రక్తం పలుచగా ఉండేలా చేయటం వలన గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాల నుంచి కాపాడుతుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఉల్లిపాయలో ఉండే సెలీనియం విటమిన్ ఇ ని ఉత్పత్తి చేస్తుంది. ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఏర్పడే ఘాటుతనం కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఎందుకంటే నేచురల్ ఐ డ్రాప్స్‌లో ఉల్లిపాయ రసం కూడా ఉంటుంది. ఆడవారికి మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను తగ్గించటంలో ఉల్లిపాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మధుమేహం, గుండె మరియు క్యాన్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ సమ్మేళనాలు డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకే ఉల్లిపాయలను కూరల్లో వేసే కన్నా పచ్చిగా తింటే మేలు కలుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…