గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Hyper Aadi : జ‌బ‌ర్ద‌స్త్ కు హైప‌ర్ ఆది కూడా గుడ్‌బై..? వ‌రుస‌గా ఇలా మానేస్తున్నారేంటి..?

Hyper Aadi : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌ కార్యక్ర‌మం ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో చాలా మంది క‌మెడియన్స్ పాపుల‌ర్ కాగా వారిలో హైప‌ర్ ఆది ఒకరు. త‌న‌దైన పంచ్‌ల‌తో అల‌రిస్తున్న హైప‌ర్…

Hyper Aadi : జ‌బ‌ర్ద‌స్త్ కు హైప‌ర్ ఆది కూడా గుడ్‌బై..? వ‌రుస‌గా ఇలా మానేస్తున్నారేంటి..?

Hyper Aadi : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌ కార్యక్ర‌మం ఎంత ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో చాలా మంది క‌మెడియన్స్ పాపుల‌ర్ కాగా వారిలో హైప‌ర్ ఆది ఒకరు. త‌న‌దైన పంచ్‌ల‌తో అల‌రిస్తున్న హైప‌ర్ ఆది ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ కి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. కొద్ది నెల‌ల క్రితం నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ ని వ‌దిలేయ‌గా, రీసెంట్‌గా రోజా గుడ్ బై చెప్పింది. ఇక ఇప్పుడు హైప‌ర్ ఆది కూడా వీడ‌నున్న‌ట్టు స‌మాచారం.

Hyper Aadi may say good bye to Jabardasth show
Hyper Aadi

జ‌బ‌ర్ద‌స్త్ జడ్జిగా చేసి రోజా మరింత ఫేమ్ అయ్యారు. ఇదివరకు నాగబాబు కూడా చేసేవారు. కానీ ఆయన మరో చాన‌ల్‌లోకి వెళ్లారు. అయితే ఇటీవల రోజా మంత్రిగా నియమితులయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇతర కార్యక్రమాలు చేసే వీలులేకుండా పోయింది. ఇదివరకు ఎమ్మెల్యేగా అయితే సమయం ఉండేది. కానీ మంత్రి కావడంతో టైమ్ లేదు. దీంతో జబర్దస్త్ టీమ్ ఆర్కే రోజాకు ఘనంగా వీడ్కోలు పలికింది. మాట్లాడుతూనే రోజా కంట తడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా ఈది హార్ట్ టచింగ్‌గా అనిపించింది.

ఇక ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ నుంచి గ్యాప్ తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ టెంపరరీ మాత్రమేనా లేక శాశ్వతంగా ఈ షోకి దూరం అవుతున్నాడా.. అనేది తెలియాల్సి ఉంది. హైపర్ ఆది జబర్దస్త్ షో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో కనిపిస్తున్నాడు. ఆది రీసెంట్ గా భీమ్లా నాయక్ చిత్రంలో మెరిశాడు. ప్రస్తుతం హైపర్ ఆది జబర్దస్త్ షో చేస్తూనే.. అవకాశం వచ్చిన చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. జబర్దస్త్ షోలో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. కానీ ఆది అవేమి పట్టించుకోలేదు. అయితే ఒక‌రి త‌రువాత ఒక‌రు జ‌బర్ద‌స్త్‌కు గుడ్ బై చెబుతుండ‌డం అంద‌రినీ షాక్‌కు గురిచేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి