Hyper Aadi : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్‌లో హైపర్ ఆది ఒకరు. ఆయన తనదైన శైలిలో పంచ్‌లు విసురుతూ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు. ప్రతి ఒక్కరినీ ఉద్దేశిస్తూ బాగా పంచులు వేస్తుంటాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా మల్లెమాల ప్రొడక్షన్ కు సంబంధించిన పలు షో లలో కూడా చేస్తున్నాడు. మధ్య మధ్యలో పలు ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తూ ఉన్నాడు.
కొంత కాలంగా హైపర్ ఆది జబర్దస్త్‌లోనే కాక శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించడం లేదు. అతనితోపాటు అతని టీం కూడా షోలో పాల్గొనడం లేదు. దీంతో హైపర్ ఆది వేరే షోకి వెళ్లాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం హైపర్ ఆది.. మల్లెమాల వారితో ఉన్న ఒప్పందం ముగింపు దశకు చేరుకుందట. అంటే హైపర్ ఆది త్వరలోనే మల్లెమాల వారితో పూర్తిగా తెగదెంపులు చేసుకోనున్నాడని, మాటీవీ కామెడీ స్టార్స్ లో కనిపించనున్నాడనే టాక్ నడుస్తోంది. మరి చూడాలి.. దీనిపై రానున్న రోజులలో అయినా క్లారిటీ వస్తుందేమో.
ఇదిలా ఉండగా ఆది అటు ఢీలో మాత్రం కనిపిస్తున్నారు. దీంతో ఆది ఫ్యాన్స్ మాత్రం మళ్లీ జబర్దస్త్‌లో తమ అభిమాన కమెడియన్ ఆది రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా జబర్దస్త్‌లో జడ్జిగా కొనసాగిన నటి రోజా జబర్దస్త్‌కు బైబై చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా జబర్దస్త్‌ని వదల్లేదు. ఆ షోకు మధ్యలో నాగబాబు దూరమైనప్పటికీ రోజా అలానే కొసాగుతూ వచ్చారు. ఇటీవల తప్పక ఆమె గుడ్ బై చెప్పింది. ప్రముఖులు అందరు ఇలా జబర్దస్త్‌ని వీడితే షో పరిస్థితి ఏంటని కొందరు ఆలోచనలు చేస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…