Hyderabad : ప్రస్తుతం కరోనా కారణం వల్ల పిల్లలకి ఆన్‌లైన్ తరగతుల కారణంగా పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్ జీవితానికి అంకితమయ్యారు. ఈ క్రమంలోనే పిల్లలు ఎక్కువ సమయం సెల్ ఫోన్ లోనే గడుపుతున్నారు. తరగతి గదులు పూర్తయినప్పటికీ సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఫోన్లకి పరిమితమవుతున్నారు. ఇలా సెల్ ఫోన్ కి పరిమితమైన ఒక కూతురిని తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని మీర్‌పేటలో సర్వోదయ నగర్ లో నివాసం ఉండే ఒక బాలిక పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌లో ఎక్కువగా గేమ్స్ ఆడటం వల్ల తన తండ్రి తనని మందలించాడు. అయితే తండ్రి మందలించాడనే మానసిక వేదనతో ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఆ బాలిక కఠినమైన నిర్ణయం తీసుకుంది.
కేవలం తన తండ్రి మందలించాడనే కోపంతోనే ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…