Heroes : ఒక హీరో స్టార్ గా ఎదగడానికి ఎంతోమంది టెక్నీషియన్స్ కృషి ఉంటుంది. కానీ వారెవరికీ రాని గుర్తింపు కేవలం ఒక హీరోకు మాత్రమే దక్కుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న క్రేజ్ మరెవరికీ ఉండదనే చెప్పవచ్చు. సినిమాను తెరపైకి తీసుకువచ్చిన దర్శకులకు గానీ, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలకు గానీ, హీరోలతో సమానంగా కష్టపడిన హీరోయిన్స్ గానీ.. ఇలా ఎవరికీ కూడా హీరోకి ఉన్నంత క్రేజ్ ఉండదు. ఒక సినిమా విడుదలైందంటే ప్రేక్షకులు తాము అభిమానించే హీరోని చూసే థియేటర్లకు క్యూ కడతారు.
అయితే సినిమా ఇండస్ట్రీ ప్రారంభమైన కొత్తలో హీరోలకు ప్రత్యేకంగా గుర్తింపు అనేది ఉండేది కాదు. ప్రేక్షకులు సినిమాలోని నటీనటులందరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ కాలక్రమేణా ఇండస్ట్రీని శాసించేది హీరోలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులలో హీరోలకు ఉన్న అభిమానం బట్టే దర్శకనిర్మాతలు కూడా వారి వద్దకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అంతే కాకుండా 1975 తరువాత కాలంలో హీరోలే సినిమా ఇండస్ట్రీకి మూలస్తంభాలు అనేంతలా పరిస్థితులు మారిపోయాయి. ఆ తరవాత కాలంలో టైటిల్స్ లో హీరోలకు స్టార్ హీరో బిరుదులు రావటం మొదలైంది.
అభిమానుల్లో హీరోకు ఉన్న క్రేజ్ ను బట్టి వారి పేరు మొదట్లో స్టార్ అనే బిరుదును దర్శకనిర్మాతలు తగిలించడం మొదలుపెట్టారు. చిరంజీవిని మొదట్లో సుప్రీం హీరో అని ముద్దుగా పిలిచేవారు. ఆ తరవాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన మరణమృదంగం చిత్రంలో మొదటిసారిగా టైటిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి అనే బిరుదులతో విడుదల చేశారు. మరణమృదంగం సినిమా టైటిల్ లో చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును దర్శకుడు కోదండరామిరెడ్డి ఇవ్వటం జరిగింది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రంతో అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అని సుకుమార్ బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్ గా పిలవబడుతున్నాడు. అంతే కాకుండా సూపర్ స్టార్, కళాతపస్వి, రెబల్ స్టార్ ఇలా మిగితా స్టార్ లు బిరుదులు అన్నీ అలా వచ్చినవే. కానీ ఒక అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రం 1957లో అప్పటి మంత్రి బెజవాడగోపాలరెడ్డి నటసామ్రాట్ అనే బిరుదును ఇచ్చారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…