Diabetes Symptoms : ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ వేగంగా పెరుగుతోంది. కొన్ని గణాంకాల ప్రకారం, భారతదేశాన్ని డయాబెటిస్ రాజధాని అని పిలుస్తారు. మధుమేహం అనేది మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం కారణంగా అభివృద్ధి చెందుతున్న వ్యాధి. డయాబెటిస్ అనేది టైప్-1, టైప్-2 అని రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగుల సంఖ్య భారతదేశంలో ఎక్కువగా ఉంది. డయాబెటిస్ వ్యాధిని సరైన సమయంలో నియంత్రించకపోతే, దాని ప్రభావం శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దీని ప్రభావం కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కళ్లపై కూడా కనిపిస్తుంది.
ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా జాగ్రత్త వహించాలి. డయాబెటిస్ వ్యాధి వచ్చింది అనటానికి కొన్ని సూచనలు కనిపిస్తాయి. అవి ఏంటంటే.. రోగి మరింత అలసిపోయినట్లు, ఎక్కువగా ఆకలి వేయటం, ఎక్కువ దాహంగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఎక్కువ సార్లు మూత్రం విసర్జన చేయవలసి వస్తుంది. ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం వల్ల డీహైడ్రేషన్ కు లోనవుతారు. డయాబెటిస్ పేషెంట్ల నోటి నుండి దుర్వాసన వస్తుంది. పురుషుల కంటే మహిళలకు మధుమేహం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
మహిళలలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనేది ఒక సాధారణ వ్యాధి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం UTI అనేది బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే వ్యాధి. తరచుగా ఈ వ్యాధిలో స్త్రీలు కిడ్నీ, గర్భాశయం లేదా మూత్రాశయం మొదలైన వాటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కొన్నిసార్లు UTI కూడా మహిళల్లో మధుమేహానికి సంకేతంగా ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
అదేవిధంగా చాలా మంది తమ నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు వస్తున్నాయని ఫిర్యాదు చేస్తారు. నోటిలో తరచుగా తెల్లటి పుండ్లు రావడం కూడా మధుమేహం లక్షణంగా చెప్పవచ్చు. అకస్మాత్తుగా బరువు తగ్గడం లేదా తగ్గడం కూడా మధుమేహం లక్షణమే. ఆడవారిలో బరువు తగ్గడం లేక పెరగడం వలన ఋతుక్రమంలో అడ్డంకులు ఏర్పడతాయి. అంతేకాకుండా చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఓవరీస్ లో నీటి బుడగలు ఏర్పడతాయి. అందువలన మహిళలకు నెలసరి అనేది కచ్చితమైన సమయానికి రాదు. ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వైద్యులను సంప్రదించి తగు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. డయాబెటిస్ ఉన్నవారు మంచి ఆహార నియమాలు పాటిస్తూ రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్టింగ్ లో 110, పోస్ట్ లంచ్ తరువాత 160 – 170 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…