Heat Stroke : శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గి చ‌ల్ల‌బ‌డాలంటే.. ఇలా చేయాలి..!

Heat Stroke : వేస‌వి కాలం.. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే మ‌న శ‌రీరం వేడిగా ఉంటుంది. ఇక వేడి ప‌దార్థాలు, నూనెతో త‌యారు చేసిన ఆహారాల‌ను తింటే.. శ‌రీరంలో వేడి ఇంకా ఎక్కువ‌వుతుంది. అలాగే బ‌య‌ట ఎక్కువ‌గా తిరిగినా కూడా శ‌రీరం వేడిగా మారుతుంది. దీంతో ఎండ దెబ్బ బారిన కూడా ప‌డ‌తారు. శ‌రీరం వేడిగా మారితే మూత్రంలో మంట‌.. విరేచ‌నాలు.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ముందుగానే జాగ్ర‌త్త ప‌డితే ఇలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అందుకు గాను శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో వేడి స‌హజంగానే త‌గ్గుతుంది. ఇక శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచేందుకు ప‌లు ఆహారాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే..

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ దానిమ్మ పండ్ల ర‌సం తాగాలి. ఇది శ‌రీరాన్ని చ‌ల్ల‌గా మారుస్తుంది. రోజంతా చ‌ల్ల‌గా ఉంచుతుంది. అలాగే రోజూ ఉద‌యం, సాయంత్రం ఒక్క గ్లాస్ చొప్పున కొబ్బ‌రినీళ్ల‌ను తాగాలి. దీని వ‌ల్ల కూడా శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఇక ఉద‌యం, సాయంత్రం ఒక టీస్పూన్ మెంతుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దీని వల్ల కూడా శ‌రీరంలోని వేడి త‌గ్గుతుంది.

Heat Stroke

రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ తేనె క‌లిపి తాగితే శ‌రీరంలోని వేడి త‌గ్గిపోతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ గ‌స‌గ‌సాల పొడిని క‌లిపి తాగినా కూడా శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. దీంతోపాటు మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అనంతరం ఒక క‌ప్పు పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను తిన‌వ‌చ్చు. లేదా ఒక గ్లాస్ త‌ర్బూజా జ్యూస్ తాగ‌వ‌చ్చు. ఇవ‌న్నీ శ‌రీరంలోని వేడి త‌గ్గించి శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుతాయి. దీంతో వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM