Mahesh Babu : చ‌ర్చంతా మ‌హేష్ ధ‌రించిన ష‌ర్ట్ గురించే.. ఇంత‌కీ అస‌లు విషయం ఏమిటి..?

Mahesh Babu : ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక సంద‌ర్భంగా మ‌హేష్ స్టేజిపై ఒకానొక ద‌శ‌లో భావోద్వేగానికి గుర‌య్యారు. త‌నకు ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై ఆయ‌న ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే స‌ర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నప్పుడు త‌న‌కు పోకిరి రోజులు గుర్తుకు వ‌చ్చాయ‌ని.. క‌నుక దానిలాగే ఈ మూవీ కూడా ఫ్యాన్స్‌ను అల‌రిస్తుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే మే 12వ తేదీన భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ప్రీ రిలీజ్ వేడుక సంద‌ర్భంగా మ‌హేష్ ధ‌రించిన ష‌ర్ట్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Mahesh Babu

ప్రీ రిలీజ్ వేడుక‌కు ఆయ‌న ఆరెంజ్ క‌ల‌ర్ ష‌ర్ట్ ధ‌రించి వ‌చ్చారు. అయితే దీనిపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇటీవ‌ల వ‌చ్చిన కాశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ మూవీల‌ను ఉత్త‌రాది వారు హిందుత్వ సినిమాలుగా అభివ‌ర్ణించారు. దీంతో మ‌హేష్ కూడా ఆ కోవ‌లోనే వెళ్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. అయితే మ‌హేష్ సినిమా స‌ర్కారు వారి పాట వాస్త‌వానికి హిందీలో రిలీజ్ కావ‌డం లేదు. కానీ ఆయ‌న‌కు హిందుత్వ సెంటిమెంట్‌ను ఆపాదిస్తున్నారు. ఆయ‌న హిందువా.. ఇంకో మ‌తాన్ని ఫాలో అవుతారా.. అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఆయ‌న బ‌య‌ట‌కు చెప్ప‌కుండా ఆయ‌న‌కు ఇలా ఒక మ‌తాన్ని ఆపాదించ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. దీంతో ఆయ‌న ఆరెంజ్ క‌ల‌ర్ ష‌ర్ట్‌పై అనేక వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఫ్యాన్స్ మాత్రం ఆయ‌న సినిమా కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు.

ఇక స‌ర్కారు వారి పాట సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించ‌గా.. ఈ మూవీకి చెందిన క‌ళావ‌తి, పెన్నీ సాంగ్స్‌తోపాటు టైటిల్ సాంగ్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. మ్యూజిక్ ప‌రంగా హిట్ అయిన ఈ మూవీ ఇత‌ర అంశాల ప‌రంగా కూడా హిట్ అవుతుంద‌ని అంటున్నారు. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ ఎలాంటి పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM