Rakshita : 2002 సంవత్సరంలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ అనే క్యాప్షన్ తో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజకు జోడీగా రక్షిత నటించింది. రక్షిత ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇడియట్ చిత్రంతో పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మొదటి చిత్రంతోనే సక్సెస్ ను అందుకోవడంతో మహేష్ బాబుతో నిజం, నాగార్జునతో శివమణి చిత్రాలలో ఆఫర్లు చేజిక్కించుకుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆంధ్రావాలా, మెగాస్టార్ చిరంజీవి అందరివాడు, జగపతి వంటి పలు చిత్రాల్లో నటించి నటన పరంగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. హీరోయిన్ రక్షిత అసలు పేరు శ్వేత. ఈమె రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత రక్షితగా పేరు మార్చుకుంది. సినిమా అవకాశాలతో కెరియర్ పరంగా మంచి జోరులో ఉన్న సమయంలో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుబ్‌డై చెప్పేసింది.
ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి కన్నడ టీవీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. రక్షిత కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. 2012లో రక్షిత రాజకీయాలలో కూడా అడుగు పెట్టడం జరిగింది. అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న అందాలభామ రక్షిత ఇప్పుడు అసలు చూడడానికి గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. రక్షితకు కొడుకు పుట్టిన తర్వాత థైరాయిడ్ వలన అధిక బరువు పెరిగానని ఓ సందర్భంలో కూడా తెలియజేసింది. అందాల భామ రక్షిత ఇలా కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…