Sukumar Movies : ఒక్కొక్క డైరెక్టర్ కి తన సినిమా తీసే విధానంలో ఒక స్టైల్ ఉంటుంది. దర్శకుడు వారు చిత్రీకరించిన చిత్రాలలో ఏదో ఒక కామన్ పాయింట్ ని చూపించడం వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆయన చిత్రాల్లో హీరోయిన్స్ బొడ్డు పై పూలు, పండ్లు వేయటం కామన్ పాయింట్ గా చూపిస్తూ ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలలో లాకెట్ అనేది కామన్ పాయింట్ గా కనిపిస్తుంది.
రాజమౌళి యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నతనంలో లాకెట్ అనేది ప్రధాన అంశంగా కనిపిస్తుంది. యమదొంగలో చిన్న వయసులో హీరోయిన్ హీరో కు లాకెట్ ఇవ్వడం ఆ తర్వాత మళ్ళీ లాకెట్ ద్వారానే హీరోయిన్ హీరోను గుర్తించడం కనిపిస్తుంది. అదే విధంగా ఈగ సినిమాలో సమంత నానికి లాకెట్ చేసి ఇస్తుంది. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ లాకెట్ సీన్ కనిపిస్తోంది.
అదేవిధంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్స్ ని అమాయకంగా, తింగరవారిగా చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఓ పాయింట్ కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే సుకుమార్ సినిమాలో హీరోయిన్లకు బ్లౌజ్‌పై పైట లేకుండా సన్నివేశాలు ఉంటాయి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో అనసూయతోపాటు సమంతకు కూడా పైట లేకుండా ఉండే సన్నివేశాలలో కనిపించారు.
అదే విధంగా ఇటీవల విడుదలైన పుష్పలో కూడా అలాంటి సీన్లు కనిపిస్తున్నాయి. ఐటమ్ సాంగ్ లో సమంత పైట లేకుండా స్టెప్పులు వేస్తుంది. అదే విధంగా రష్మిక మందన్న కూడా కొన్ని సన్నివేశాలలో పైట లేకుండానే కనిపిస్తుంది. దర్శకుడు సుకుమార్ తీసే సినిమాను బట్టి తన స్టైల్ ను మార్చుకుంటూ ఉంటాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే సినిమాల్లోనే ఈ క్రేజీ దర్శకుడు పైట లేకుండా ఉండే సన్నివేశాలను హీరోయిన్స్ తో చిత్రీకరిస్తాడు. కానీ మిగతా సినిమాల్లో అలాంటి సీన్లు ఎక్కడ కనిపించవు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…