Viral Photo : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా ఫోటోలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు పోజిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. చేసింది తక్కువే సినిమాలు కానీ అబ్బాయిలకు హాట్ ఫేవరెట్. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. బేబమ్మా అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు.. ఎవరో గుర్తుపట్టారా..? ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమె ఎవరో కాదు కృతి శెట్టి.
టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి.. వెంట వెంటనే క్రేజ్ ఆఫర్స్ వచ్చాయి. అంతేకాకుండా ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అబ్బాయిల్లో బాగా పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజుతో వరుస హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ అయినా బేబమ్మ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం సుధీర్ బాబుతో నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విడుదలకు సిద్ధంగా ఉంది. మరి కృతి ఈ మూవీతోనైనా హిట్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…