Hanuman Junction : హ‌నుమాన్ జంక్ష‌న్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవ‌రంటే..?

Hanuman Junction : మోహన్ రాజా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. దాదాపు 20 సంవత్సరాల క్రితం మోహన్ రాజా దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రం హనుమాన్ జంక్షన్. హీరో అర్జున్, జగపతిబాబు, వేణు తొట్టెంపూడి హీరోలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను కామెడీ పరంగా ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవల మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా కోసం  అర్జున్, జగపతి బాబులను మొదటగా హీరోలుగా అనుకోలేదని మోహన్ రాజా  చెప్పారు. తను ఈ సినిమాలో ముందుగా మోహన్ బాబు మరియు రాజశేఖర్ లను హీరోలుగా పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఇద్దరికీ హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించడానికి అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత మంచి స్టార్ డమ్ అండ్ డెడికేషన్ ఉన్న హీరోలు కావడంతో ఇద్దరినీ మెయింటెన్ చేయగలనా.. అనే ప్రశ్న ఆయనలో తలెత్తింది అని తెలిపారు.

Hanuman Junction

ఆ సందిగ్ధంలో ఉండగా ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన మోహన్ రాజా తండ్రి మోహన్ ఈ సినిమాలో హీరోలుగా అర్జున్,  జగపతి బాబులను ఫిక్స్ చేశారట. అలా తన తండ్రి వల్ల హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబు మరియు అర్జున్ హీరోలుగా చేశారని మోహన్ రాజా వెల్లడించారు. ప్రస్తుత మోహన్ రాజా తీస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం మాస్ ఓరియంటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళ‌యాళంలో సూపర్ హిట్ సక్సెస్ ను అందుకున్న లూసిఫర్ చిత్రానికి తెలుగు అనువాద చిత్రం గాడ్ ఫాదర్. ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM