Ghani Movie : గని టీజర్‌తో మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా దొరికింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గని. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నరేష్, నదియా కీలక రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్స్, వీడియోలు విడుదల చేశారు. సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ రానే వచ్చింది. తాజాగా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో విడుదలైన టీజర్ మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.
టీజర్‌లో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలను చూపించారు. వరుణ్ బాక్సింగ్ పంచ్‌లతోపాటు ఇతర పాత్రల సీరియస్ యాక్షన్స్ కూడా రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో నడిచింది. ఈ టీజర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేస్తోంది. కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన జోనర్స్ ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా, అందులో నెగిటివ్ షేడ్స్ లో కనిపించడం విశేషం. కాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…