Ghani Movie : ప‌వ‌ర్‌ఫుల్ వాయిస్‌తో చ‌ర‌ణ్‌.. యాక్ష‌న్ స‌న్నివేశాలతో వ‌రుణ్‌.. అద‌ర‌గొట్టేశారంతే..!

November 15, 2021 7:03 PM

Ghani Movie : గ‌ని టీజ‌ర్‌తో మెగా ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా దొరికింది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గ‌ని. వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నరేష్, నదియా కీలక రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Ghani Movie teaser creating sensation

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప‌లు పోస్ట‌ర్స్, వీడియోలు విడుద‌ల చేశారు. సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజ‌ర్ రానే వ‌చ్చింది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ తో విడుద‌లైన టీజ‌ర్ మెగా ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది.

టీజ‌ర్‌లో ప‌వర్ ఫుల్ యాక్ష‌న్ స‌న్నివేశాలను చూపించారు. వ‌రుణ్ బాక్సింగ్ పంచ్‌ల‌తోపాటు ఇతర పాత్ర‌ల సీరియ‌స్ యాక్ష‌న్స్ కూడా రామ్ చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచింది. ఈ టీజర్ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తోంది. కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన జోనర్స్ ఎంచుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా, అందులో నెగిటివ్ షేడ్స్ లో కనిపించడం విశేషం. కాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment