Gangavalli : నిత్యం మనం ఎన్నో మొక్కలను చూస్తూనే ఉంటాం. కానీ ఆ మొక్కలలో ఉన్న ఔషధ గుణాలు చాలా వరకు తెలియదు. అవి పిచ్చి మొక్కలు అనుకోని వాటిని పీకి పడేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క ఆ కోవకు చెందిందే. గంగవల్లి కూర మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు.. ఈ మొక్క వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలియక పోవచ్చు. పిచ్చి మొక్క అనుకొనే గంగవల్లి కూరలో దాగి ఉన్న ఔషధ గుణాలు.. వాటి ప్రయోజనాలు గురించి తెలిస్తే ఇంక ఎప్పుడూ దాన్ని వదిలిపెట్టరు.
ఈ మొక్కలు పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకు కూరలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా వీటిని ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ మొక్కను మీ పెరటిలో ఒక్కసారి నాటుకుంటే చాలా సులభంగా పెరిగిపోతుంది. ఈ గంగవల్లి ఆకులలో సమృద్ధిగా విటమిన్ ఎ లభిస్తుంది. విటమిన్ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.
ఈ ఆకుకు శరీరంలోని విష పదార్థాలను దూరం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. ఎముకలు బలంగా ఉండడానికి సహకరిస్తాయి. అనేక రకాల ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఏ ఆకు కూరలు లేని ఒమెగా-3 ఆమ్లాలు గంగవల్లి ఆకుకూరలో ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ ఆకు కూరను తినడం ద్వారా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్ వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. గంగవల్లి కూర కాండం, ఆకులలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.
ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అన్ని రక్త కణాలకు ఆక్సిజన్ అందేలా చేస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఈ కూరలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వలన శరీరం అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. విటమిన్ సి చర్మ రక్తనాళాలు సక్రమంగా ఉంచడానికి దోహదపడుతుంది. గాయాలు అయిన చోట గంగవల్లి ఆకుల రసాన్ని రాసి కట్టుకడితే త్వరగా మానిపోయేలా చేస్తుంది. కనుక ఇంకెప్పుడైనా ఈ ఆకుకూర కనిపిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకోండి. అసలు విడిచిపెట్టకండి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…