Cold And Cough : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అనేక రోగాలు మనల్ని చుట్టుముట్టి వస్తూ ఉంటాయి. తడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో నీరు, గాలి, ఆహారం ద్వారా బ్యాక్టీరియా మన శరీరానికి చేరుకుంటుంది. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మనల్ని అనేక విధాలుగా సతమతం చేస్తూ ఉంటాయి. ఈ సీజన్లో ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే అద్భుతమైన ఇంటి చిట్కాలు మనకు ఎంతగానో సహకరిస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతోనే మన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఏంటో చూద్దాం.
పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 5 స్పూన్ల పంచదార వేసి మీడియం హీట్ లో పంచదారను బాగా కలుపుతూ క్యారమెల్ లా తయారుచేసుకోవాలి. దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బిర్యానీ ఆకులలో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గు, కఫం తగ్గించడానికి సహాయపడతాయి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో పది మిరియాలు, పది లవంగాలు, పది తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, చిన్న ముక్క బెల్లం వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.
నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టాలి. ఇలా వడకట్టిన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ పెద్ద వారైతే 2 టీస్పూన్స్, చిన్న వారైతే ఒక టీస్పూన్ తీసుకోవాలి. ఇలా ఈ ద్రవాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలా తీసుకోవడం వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గడంతోపాటు దగ్గు, జలుబు వంటివి కూడా త్వరగా నయం అవుతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…
తాను పెళ్లి చేసుకోబోతున్నానని మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న వార్తలను నటి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేరకు…
భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయని, హాలీవుడ్‌లో సినిమాల విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని, అందుకనే అక్కడ…
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో…