Liger Movie Mistake : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పూరీ, ఛార్మీ కలిసి నిర్మించారు. అయితే మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ మొదలయ్యింది. సినిమా కథ బాగోలేదని, పాటలు కథకు సంబంధం లేకుండా ఉన్నాయని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. మరోవైపు హిందీ మూవీని తెలుగులో డబ్ చేసినట్టు ఉందని కూడా అంటున్నారు. సినిమాలకు రేటింగ్ ఇచ్చే IMDB వరస్ట్ సినిమాల లిస్ట్ లో లైగర్ అతి తక్కువ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.
ఒక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే అందులో తప్పులున్నా, లాజిక్‌లు మిస్ అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఓ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న లైగర్ డిజాస్టర్ అయితే ప్రతి సన్నివేశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు. ఈ విషయంపై మేకర్స్‌కు కూడా ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెలిసే పొరపాట్లు చేశారా అనిపిస్తుంటుంది. లైగర్ విషయంలో అదే జరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని మిస్టేక్ ను పట్టుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ సినిమా క్లైమాక్స్ లో బాక్సింగ్ రింగ్ లో లైగర్ ఫైట్ చేస్తూ పడిపోతాడు. ఈ మ్యాచ్ వెగాస్ లో జరుగుతుంది. కాగా లైగర్ తల్లి రమ్యకృష్ణ ఇండియాలో టీవీ చూస్తూ ఉట్నా సాలే అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో బాక్సింగ్ రింగ్ లో ఉన్న లైగర్ లేచి మళ్ళీ ఫైట్ చేస్తాడు. ఇక ఇండియాలో రమ్యకృష్ణ అరిస్తే.. వేరే దేశంలో ఉన్న లైగర్ కు ఎలా వినపడింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో ఇది పెద్ద రాడ్ సీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందు లైగర్ టీం చేసిన ఓవర్ యాక్షన్ తో.. నెటిజన్లు లైగర్ ట్రోలింగ్స్ ఇప్పట్లో ఆపేలా లేరు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…