Liger Movie Mistake : లైగర్ మూవీలో ఈ త‌ప్పును గమనించారా.. ఇంత పెద్ద త‌ప్పు అస‌లు ఎలా చేశారు..?

August 31, 2022 7:16 PM

Liger Movie Mistake : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో పూరీ, ఛార్మీ కలిసి నిర్మించారు. అయితే మొదటి రోజే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ మొదలయ్యింది. సినిమా కథ బాగోలేదని, పాటలు కథకు సంబంధం లేకుండా ఉన్నాయని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. మరోవైపు హిందీ మూవీని తెలుగులో డబ్ చేసినట్టు ఉందని కూడా అంటున్నారు. సినిమాలకు రేటింగ్ ఇచ్చే IMDB వరస్ట్ సినిమాల లిస్ట్ లో లైగర్ అతి తక్కువ రేటింగ్ తో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఒక సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అందులో తప్పులున్నా, లాజిక్‌లు మిస్‌ అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఓ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న లైగర్‌ డిజాస్టర్‌ అయితే ప్రతి సన్నివేశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు. ఈ విషయంపై మేకర్స్‌కు కూడా ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెలిసే పొరపాట్లు చేశారా అనిపిస్తుంటుంది. లైగర్‌ విషయంలో అదే జరిగిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని మిస్టేక్ ను పట్టుకుని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

not every body noticed this Liger Movie Mistake
Liger Movie Mistake

ఈ సినిమా క్లైమాక్స్ లో బాక్సింగ్ రింగ్ లో లైగర్ ఫైట్ చేస్తూ పడిపోతాడు. ఈ మ్యాచ్ వెగాస్ లో జరుగుతుంది. కాగా లైగర్ తల్లి రమ్యకృష్ణ ఇండియాలో టీవీ చూస్తూ ఉట్నా సాలే అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో బాక్సింగ్ రింగ్ లో ఉన్న లైగర్ లేచి మళ్ళీ ఫైట్ చేస్తాడు. ఇక ఇండియాలో రమ్యకృష్ణ అరిస్తే.. వేరే దేశంలో ఉన్న లైగర్ కు ఎలా వినపడింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో ఇది పెద్ద రాడ్ సీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందు లైగర్ టీం చేసిన ఓవర్ యాక్షన్ తో.. నెటిజన్లు లైగర్ ట్రోలింగ్స్ ఇప్పట్లో ఆపేలా లేరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment