Ram Charan : చ‌ర‌ణ్ ను క‌లిసేందుకు ఏకంగా 264 కిలోమీట‌ర్లు న‌డిచిన అభిమాని..!

Ram Charan : హీరోలు అంటే అభిమానించే వారు చాలా మందే ఉంటారు. త‌మ అభిమాన హీరోను క‌నీసం ఒక్క‌సారి అయినా స‌రే క‌లుసుకోవాల‌ని ప‌రిత‌పిస్తుంటారు. అందులో భాగంగానే వారిని క‌లిసేందుకు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే ఆ క‌ల కేవ‌లం కొంద‌రు ఫ్యాన్స్‌కు మాత్ర‌మే నెర‌వేరుతుంది. ఇక కొంద‌రు ఫ్యాన్స్ అయితే త‌మ అభిమాన హీరోల కోసం ఎన్నో వెరైటీ ప‌నులు కూడా చేస్తుంటారు. అలా వారు చేసే ప‌నులు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాగే ఓ వ్య‌క్తి కూడా త‌న అభిమాన హీరో రామ్ చ‌ర‌ణ్‌ను ఆక‌ట్టుకునేందుకు ఓ ప్ర‌య‌త్నం చేశాడు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌ను క‌లుసుకోగ‌లిగాడు. ఇక ఈ విష‌యం గురించి మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే..

తెలంగాణలోని గద్వాల్‌ జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్నాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ మీద ఉన్న అభిమానంతో గ‌తంలో ఇత‌ను ఒక ఎక‌రం పొలాన్ని కౌలుకు తీసుకుని దాంట్లో రామ్ చ‌ర‌ణ్ తేజ ముఖ చిత్రం వ‌చ్చేలా వ‌రి పంట‌ను పండించాడు. దీంతో అప్ప‌ట్లో ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అయితే అలా పండించిన వ‌రి ధాన్యాన్ని తీసుకుని అత‌ను సుమారుగా 264 కిలోమీట‌ర్లు న‌డిచి వ‌చ్చి రామ్ చ‌ర‌ణ్‌ను క‌లిశాడు. ఎట్ట‌కేల‌కు త‌న క‌ల నెర‌వేరింద‌ని అత‌ను సంతోషం వ్య‌క్తం చేశాడు.

Ram Charan

ఇక అప్ప‌ట్లో తాను పండించిన రామ్ చ‌ర‌ణ్ ముఖ చిత్రం క‌లిగిన వ‌రి పంట తాలూకు ఫొటోలు, వీడియోల‌ను రామ్ చ‌ర‌ణ్‌కు చూపించాడు. అనంత‌రం ఆ పంట‌కు చెందిన ధాన్యాన్ని చ‌ర‌ణ్‌కు అంద‌జేశాడు. దీంతో చ‌ర‌ణ్ ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యారు. త‌న‌పై త‌న అభిమాని చూపిస్తున్న అభిమానానికి చ‌ర‌ణ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు త‌న ఫ్యాన్‌తో చ‌ర‌ణ్ స‌ర‌దాగా గ‌డిపాడు. కాగా ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. చ‌ర‌ణ్ త‌న ఫ్యాన్‌ను చాలా చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నాడ‌ని.. ఆయ‌న ఫ్యాన్స్ అంద‌రూ మురిసిపోతూ.. ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM