Disha Patani : నీ ఫిగ‌ర్ సైజ్ ఎంత ? అని అడిగిన ఫ్యాన్‌.. దిశా ప‌టానీ ఏమ‌న్న‌దంటే..?

November 10, 2021 11:39 PM

Disha Patani : సెల‌బ్రిటీలు ఎప్పుడూ ఏ ప‌ని చేసినా దాని తాలూకు విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో త‌మ అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. ఇక తాము ప్ర‌చారం చేసే ఉత్ప‌త్తుల‌కు చెందిన పోస్టుల‌ను కూడా సోష‌ల్ మీడియాలో పెడుతుంటారు. ఇలా వారు డ‌బ్బు సంపాదిస్తుంటారు.

fan asked Disha Patani  uncomfortable question what she replied

అయితే సెల‌బ్రిటీలు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో లైవ్‌గా ముందుకు వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంటారు. ఇలాగే న‌టి దిశా ప‌టానీ కూడా త‌న అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఆమె అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెట్టింది.

అయితే ఒక ఫ్యాన్ మాత్రం నీ ఫిగ‌ర్ సైజ్ ఎంత ? అని అడిగే స‌రికి దిశా ప‌టానీకి ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌దు. మ‌రోవైపు లైవ్‌లో ఉంది. దీంతో ఆమె ఒక పాండా ఫొటోను షేర్ చేసింది. సాధార‌ణంగా ఇలాంటి సంద‌ర్భాల్లో అయితే సెల‌బ్స్ కోపంతో ఊగిపోతారు. కానీ దిశా ప‌టానీ మాత్రం ఆ విధంగా చేసింది. ఈ క్ర‌మంలో ఆమె ఇచ్చిన రిప్లై అంత స్ట్రాంగ్‌గా లేక‌పోయినా.. స‌ద‌రు ఫ్యాన్‌ను ఉతికి ఆరేయాల్సింది.. అని ఇత‌ర ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now